భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్
Published on Tue, 09/01/2026 - 08:31
తెలుగులో అప్పుడెప్పుడో 2022లో వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమాలో చివరగా కనిపించిన నిత్యామేనన్.. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 50కి పైగా మూవీస్ చేసిన ఈమె ఇప్పుడు ఓ శుభవార్త చెప్పేసింది. నిర్మాతగా మారినట్లు వెల్లడించింది.
(ఇదీ చదవండి: మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో:జీవీ ప్రకాశ్)
హీరోయిన్లు.. నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. అప్పట్లోనే మహానటి సావిత్రి లాంటి వాళ్లు తమ అభిరుచికి తగ్గ మూవీస్ చేశారు. ప్రస్తుతం అగ్రనటిగా ఉన్న నయనతార కూడా చిత్ర నిర్మాణం చేపట్టి వరసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి నిత్యామేనన్ చేరింది. కేయూరి ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి తొలి ప్రయత్నంగా లియో విజన్ సంస్థతో కలిసి చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయింది.
ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రానికే క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగా వ్యవహరిస్తున్న నిత్యామేనన్ ఇందులో హీరోయిన్‌గానూ చేస్తోంది. డీకే కథ ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఫాంటసీ విత్ డార్క్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇతర నటీనటులు, టైటిల్ లాంటి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.
(ఇదీ చదవండి: న*గ్న వీడియోపై 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ సీరియస్)
Tags : 1