Breaking News

జీవితంలో తొలిసారి పిడకలు చేశా.. ఆ మరునాడే..: నిత్యామీనన్‌

Published on Wed, 07/16/2025 - 15:32

సినిమా అంటే ఇష్టం లేదంటుంది. కానీ సినిమా కోసం ఏదైనా చేస్తుంది. సినిమాలు మానేయాలని ఆలోచిస్తుంది. కానీ తను అడుగుపెట్టిన ప్రతి ప్రాజెక్టులో అద్భుతంగా నటిస్తుంది. అలా తరుచిత్రంబళం (తెలుగులో తిరు) సినిమాకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది నిత్యామీనన్‌ (Nithya Menen). ప్రస్తుతం ఈ బ్యూటీ ఇడ్లీ కడై (తెలుగులో ఇడ్లీ కొట్టు) (Idly Kadai Movie) సినిమా చేస్తోంది. ధనుష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్య.. పల్లెటూరి యువతిగా కనిపించనుంది. 

పిడకలు చేశా..
ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే తిరు సినిమాకు వచ్చిన జాతీయ అవార్డును అందుకోవడానికి వెళ్లింది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ కడై సినిమా కోసం నేను పిడకలు చేయడం నేర్చుకున్నాను. పిడకలు చేయడానికి సమ్మతమేనా? అని అడగ్గానే ఎందుకు చేయను? అని రంగంలోకి దిగాను. నా జీవితంలో తొలిసారి పేడ చేతిలో పట్టుకుని దాన్ని గుండ్రంగా పిడకలు చేశాను. పిడకలు చేసిన మరునాడే జాతీయ అవార్డు తీసుకునేందుకు వెళ్లాను. అప్పుడు నా వేలి గోర్లలో ఆ పేడ ఇంకా అలాగే ఉంది.

ఇంత మంచి అనుభూతి..
అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమా ద్వారా విభిన్నమైన విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీ చేయకపోయుంటే ఇంత మంచి అనుభూతి నాకు దక్కేదే కాదు అని చెప్పుకొచ్చింది. ఇడ్లీ కడై విషయానికి వస్తే తిరుచిత్రంబలం సినిమా తర్వాత ధనుష్‌- నిత్య కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది! ఇందులో అరుణ్‌ విజయ్‌, షాలిని పాండే, సత్యరాజ్‌, పార్తీబన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్‌ 1న విడుదల కానుంది.

చదవండి: చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు