Breaking News

చిత్ర పరిశ్రమలో ఉండటం ఇష్టం లేదు.. కారణం ఇదే: నిత్య మేనన్

Published on Wed, 01/22/2025 - 07:02

మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించిన నిత్య మేనన్‌కు(Nithya Menen) భారీగానే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఎంచుకున్న పాత్రలు కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. సినిమా రంగం వల్ల తనకు పేరు, ప్రఖ్యాతలు ,ఆస్తులు, అంతస్తులు అన్ని వచ్చాయి. అయినప్పటికీ తనకు చిత్ర పరిశ్రమలో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. అందుకే ఈమెను సంచలన నటి అంటారు. ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్న ఈ మలయాళ భామ తాజాగా రవి మోహన్‌​తో (జయం రవి) కలిసి నటించిన చిత్రం కాదలిక్క నెరమిల్లై (Kadhalikka Neramillai). 

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న  నిత్య మేనన్‌ ఒక భేటీలో పేర్కొంటూ తనకు నచ్చని రంగం సినిమా అని డైరెక్ట్‌గానే చెప్పింది. తనకు ఏదైనా రంగంలో ఇప్పుడు అవకాశం వస్తే వెళ్లిపోతానని పేర్కొంది. సెలబ్రిటీలా కాకుండా తనకు సాధారణ జీవితాన్ని అనుభవించడమే ఇష్టమని పేర్కొంది. అదేవిధంగా తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే పైలెట్‌ కావాలని చిన్నప్పుడు కోరుకున్నానని గుర్తు చేసుకుంది. కానీ, ఫైనల్‌గా నటిని అయ్యానని చెప్పింది. నటిగా స్వేచ్ఛగా జీవించడం మరిచిపోయానని తెలిపింది. 

అదేవిధంగా పార్కుల్లో నడవటం అంటే ఎంతో ఇష్టమని అయితే అది ఇప్పుడు జరగదని పేర్కొంది. ఒక్కొక్కసారి ఇదంతా నాకు అవసరమా అని అనిపిస్తుందని చెప్పింది. జాతీయ అవార్డు రాకముందు సైలెంట్‌ గా ఎక్కడికై నా వెళ్లిపోతామని భావించానంది అలాంటి సమయంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిందనే వార్త తెలిసిందని నటి నిత్యా మీనన్‌ చెప్పింది. కాగా ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  నిత్యామీనన్‌ ప్రస్తుతం ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఇడ్లీ కడై చిత్రంలో కథానాయికిగా నటిస్తుంది.
 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)