Breaking News

DNA బ్యూటీ ఛాతీ పైభాగంలో టాటూ.. అర్థమేంటో తెలుసా?

Published on Sun, 08/17/2025 - 10:45

పెద్దగా ప్రచారంలోకి రాని ముఖమే అయినా, తెరపై కనిపించినప్పుడల్లా చూపు తిప్పుకోలేనంతగా ఆకట్టుకునే నటి నిమిషా సజయన్‌ (Nimisha Sajayan). ప్రస్తుతం బలమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

బ్లాక్‌బెల్ట్‌
నిమిషా తండ్రి సజయన్‌, తల్లి అనంతవల్లి ఇద్దరూ కేరళ వాసులే అయినా, కుటుంబం ముంబైలో స్థిరపడింది. ఆమె బాల్యం ముంబై వీధుల్లో గడిచింది. అందుకే ‘ఆ నగరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటుందామె. నిమిషా తైక్వాండోలో నిపుణురాలు. బాల్యంలోనే బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. పాఠశాల నుంచే ఫుట్‌బాల్, వాలీబాల్‌ బృందాలకు నాయకత్వం వహించింది. యోధురాలిగా ఎదిగిన ఆమె, తెరపై మార్దవానికి నిర్వచనంగా మారింది.

మేకప్‌ నచ్చదు
నటన విషయంలో పైపైమెరుపుల కంటే అభినయమే అవసరం అన్నది నిమిషా అభిప్రాయం. అందుకే ఆమె చేసిన చిత్రాల్లో గ్లామర్‌కు చోటు తక్కువ. ‘ఒరు కుప్రసిద్ధ పయ్యన్‌’, ‘చోళ’ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డులు అందుకుంది. ‘నాకు మేకప్‌ నచ్చదు, అవసరమైతే పాత్ర కోసమే మేకప్‌ చేసుకుంటాను’ అన్న ఆమె వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. 

అప్పటికప్పుడు వంట నేర్చుకుని..
కానీ తను వెంటనే స్పందించి, ‘వ్యక్తిగత అభిరుచి వేరు, నటనా బాధ్యత వేరు’ అంటూ వివాదాన్ని ముగించింది. ఓ సినిమా సెట్లో వంటవాడి దగ్గర పరోటా చేయడం నేర్చుకుని, స్పాట్‌లో స్వయంగా పరోటా చేసి పెట్టిన సంఘటన తెర వెనక ముచ్చటగా మారి వైరల్‌ అయింది. చిన్నతనంలో ఇంటి ఆవరణలో నీళ్లు పోస్తున్నట్లు నటించి, తండ్రిపై నీళ్లు చల్లడమే తన మొదటి నటన అని గుర్తు చేసుకుంటుంది.  

GST చెల్లించలేదని ఆరోపణలు
ఆమెపై వేసిన పన్నుల వివాదం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ముప్పై లక్షల జీఎస్‌టీ చెల్లించలేదన్న ఆరోపణలపై ఆమె తల్లి ప్రత్యక్షంగా స్పందించి ఆధారాలతో సహా ఖండించారు. ‘అక్కడ నా తల్లే నిజమైన హీరో’ అని నిమిషా చెప్పింది. చిత్రలేఖనంతో పాటు ఫొటోగ్రఫీలోనూ నిమిషా ప్రతిభావంతురాలే! ఈ రెండూ ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. సంప్రదాయ వంటలు అంటే ప్రాణం. పాల పాయసం, చేపల వంటలు, సధ్యా లేకుండా ఏ పండుగ తనకు అసలైన పండుగలా అనిపించదట.

రంగు అడ్డు కాదు
కొందరు రంగుపై వివక్ష చూపుతూ ‘ఇలాగుంటే పాత్రలు రావు’అని విమర్శించినా, నిమిషా మాత్రం ‘ప్రతిభ ఉన్న చోట రంగు అడ్డుకాదు’ అన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఆమె ఛాతీపై ఉన్న సూర్యచక్రపు గుర్తు తన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకంగా ఉండాలి’ అని నమ్ముతుంది. ఈమె చివరగా DNA సినిమాలో కనిపించింది.

 

 

చదవండి: బరువు తగ్గాను.. మళ్లీ కథలు వింటున్నా: కీర్తి సురేష్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)