Breaking News

ఓటీటీలో నిహారిక కొత్త సినిమా.. వచ్చేవారమే స్ట్రీమింగ్‌

Published on Tue, 01/28/2025 - 09:20

ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన నిహారిక (Niharika Konidela) తర్వాత సడన్‌గా యాక్టింగ్‌ను పక్కనపెట్టేసింది. మధ్యలో యాంకరింగ్‌ ట్రై చేసింది. అలాగే నిర్మాతగా మారి చిన్న చిత్రాలను ఎంకరేజ్‌ చేసింది. ఈ క్రమంలో పలు హిట్స్‌ అందుకుంది. చాలాకాలం తర్వాత ఆమె డెడ్‌ పిక్సెల్స్‌ వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ సినిమా చేసింది. అదే మద్రాస్‌కారన్‌ (Madraskaaran Movie). షేన్‌ నిగమ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిహారిక కథానాయిక. 

నెల రోజుల్లోనే ఓటీటీలోకి..
వాలిమోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బి.జగదీష్‌ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. పొంగల్‌ రేసులో ఉన్న విశాల్‌ మదగజరాజ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకుపోయింది. కానీ మద్రాస్‌కారన్‌ మాత్రం వసూళ్లు రాబట్టడంలో వెనకబడిపోయింది. సామ్‌ సీఎస్‌ సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది.

వచ్చే వారంలో..
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. దీంతో నిహారిక సినిమా చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది తమిళ వర్షన్‌లో మాత్రమే అందుబాటులోకి రానుంది.

 

చదవండి: గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ..

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)