Breaking News

నిహారిక- చైతన్య విడాకులు.. అసలు కారణం అదేనా?

Published on Tue, 07/04/2023 - 20:26

మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక తాజాగా కూకట్‌పల్లి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు బాగానే ఉ‍న్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. 

(ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక)

ఇటీవల జరిగిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లోనూ చైతన్య కనిపించలేదు. జొన్నలగడ్డ చైతన్య కూడా తన ఫ్యామిలీతో కలిసి తిరుమలలో కనిపించారు. దీంతో వీరిద్దరు డైవర్స్ తీసుకుంటున్నట్లు చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా నిహారిక పిటిషన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు కన్‌ఫార్మ్ చేసింది. అయితే ఈ జంట ఇంత త్వరగా విడిపోవడానికి కారణాలేంటనేది ఇప్పటికి వరకు తెలియరాలేదు. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలే విడాకులకు దారితీసి ఉంటాయని నెట్టింట చర్చ మొదలైంది. మరికొందరు పరస్పర విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణమని చెబుతున్నారు.  

పెళ్లి తరువాత నిహారిక నిత్యం వివాదాలు తలెత్తాయి. ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడంతో ఆ వార్త పెద్దఎత్తున వైరలైంది. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌ వాళ్లతో గొడవ సందర్భంగా నిహారికను మరో వివాదం చుట్టుముట్టింది. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.  

(ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!)

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)