Breaking News

ఓటీటీలో 'మ‌ద్రాస్‌కార‌ణ్' తెలుగు వర్షన్‌.. రొమాంటిక్‌ సాంగ్‌లో నిహారిక

Published on Tue, 02/25/2025 - 17:00

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల తమిళ సినిమా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'మ‌ద్రాస్‌కార‌ణ్' చిత్రం కోలీవుడ్‌లో విడుదలైంది. ఈ మూవీలో షేన్ నిగ‌మ్‌, క‌లైయ‌రాస‌న్ హీరోలుగా న‌టించారు. థియేట‌ర్ల‌లోకి వచ్చి నెల రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే తమిళ్‌ వర్షన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వర్షన్‌ను మేకర్స్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

వాలిమోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బి.జగదీష్‌ నిర్మించారు. తమిళ్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. విశాల్‌ మదగజరాజ మూవీ హిట్‌ టాక్‌ రావడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్‌ తగ్గింది. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న 'ఆహా'లో 'మ‌ద్రాస్‌కార‌ణ్' సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 5 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే,  కోటి లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టడంతో నిర్మాతలకు భారీ న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది.

ఏడేళ్ల తర్వాత రొమాంటిక్‌ పాత్రతో రీఎంట్రీ
సుమారు ఏడేళ్ల తర్వాత 'మ‌ద్రాస్‌కార‌ణ్' సినిమాతో తమిళ్‌లో నిహారిక రీఎంట్రీ ఇచ్చింది.  2018లో విజ‌య్ సేతుప‌తి నటించిన ఒక సినిమాతో ఆమె కోలీవుడ్‌కు పరిచయం అయింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీలో మీరా అనే యువ‌తిగా గ్లామ‌ర్ రోల్‌లో నిహారిక  క‌నిపించింది. ఒక రొమాంటిక్‌ సాంగ్‌లో కూడా ఆమె నటించింది. ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇందులోని సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి! ఈ సినిమాతో హీరోయిన్‌గా హిట్టు కొట్టాల‌ని నిహారిక ప్లాన్‌ చేసుకుంది. కానీ, ఫలితం మరోలా వచ్చింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)