నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం

Published on Mon, 04/14/2025 - 15:14

సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్. అందుకే పలువురు నెటిజన్లు.. హీరోహీరోయిన్లపై అప్పుడప్పుడు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని సదరు నటీనటులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చేస్తుంటారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఇ‍ప్పుడు ఓ కుర్రాడికి అలానే కౌంటర్ ఇచ్చింది.

ఏం జరిగిందంటే?
నిధి అగర్వాల్ గురించి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దీనికి స్పందించిన ఓ నెటిజన్ ఈమెని శ్రీలల(Sreeleela) పోలుస్తూ వ్యంగ‍్యంగా వ్యాఖ్యలు చేశాడు. 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి ఏం చేసింది? ఎన్ని మూవీస్ చేసింది? అని అన్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

ఈ ట్వీట్ పై స్వయంగా స్పందించిన నిధి అగర్వాల్.. సదరు నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. 'ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది. తమిళంలో మూడు మూవీస్ చేసింది. హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)కి సంతకం చేసింది. మంచి స్క్రిప్ట్ లు అనుకున్న వాటికే సంతకం చేస్తున్నా. అందుకు టైమ్ తీసుకుంటున్నాను. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పయి ఉండొచ్చు. కానీ మంచి సినిమాలు చేయాలనేది నా అభిప్రాయం. వరసగా సినిమాలు చేయాలనే తొందరేం లేదు. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. కాబట్టి బ్రదర్.. నా గురించి నువ్వేం బాధపడకు' అని చెప్పుకొచ్చింది.

నిధి అగర్వాల్ బాగానే కౌంటర్ చేసింది. కానీ సదరు నెటిజన్ అన్నదాంట్లోనూ కాస్త నిజముంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తప్పితే నిధి అగర్వాల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీ లేదు. పవన్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్(The Raja Saab Movie) చేసింది గానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ‍అటు శ్రీలీల కూడా సినిమాలైతే చేస్తోంది గానీ దాదాపు ఫ్లాప్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)