Breaking News

వరలక్ష్మి శరత్‌కుమార్ ఫస్ట్‌ లవ్‌ నేను కాదు: నికోలాయ్ సచ్‌దేవ్‌

Published on Mon, 07/15/2024 - 17:13

కోలీవుడ్‌ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ముంబై గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌లు కొద్దిరోజుల క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జూలై 10న థాయిలాండ్‌లోని క్రాబీ బీచ్ రిసార్ట్‌లో సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్లి ముగియడంతో ఈరోజు వీరిద్దరూ చెన్నైలో తమ నివాసంలో తొలిసారి మీడియాతో మాట్లాడారు.

వరలక్ష్మీ భర్త నికోలాయ్ ఇలా చెప్పుకొచ్చాడు. 'నేను కూడా తమిళం నేర్చుకుంటున్నాను. నాకు ఇప్పుడు తమిళంలో పొంతటి (భార్య) అనే పదం మాత్రమే తెలుసు. ఇకనుంచి నా ఇల్లు ముంబై కాదు.. చెన్నైనే నా ఇల్లు. నన్ను నేను మీకు పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు నికోలాయ్ సచ్‌దేవ్. నాకు వరలక్ష్మి అనే అందమైన అమ్మాయితో పెళ్లయింది. అందరూ అనుకున్నట్లు పెళ్లి తర్వాత వరలక్ష్మి తన పేరును వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్‌దేవ్‌గా మార్చుకోవడం లేదు. నాకు కూడా ఆమె పేరు వరలక్ష్మి శరత్‌కుమార్‌గానే నచ్చింది. 

కానీ, నేను మాత్రం ఆమె పేరును తీసుకుంటున్నాను. ఇకనుంచి నా పేరు 'నికోలాయ్ వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్‌దేవ్'గా మార్చుకుంటున్నాను. శరత్‌కుమార్, వరలక్ష్మిల కీర్తి ఇప్పుడు నా సొంతం. వరలక్ష్మి నన్ను పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె ఫస్ట్‌ లవ్‌ మాత్రం నేను కాదు. ఆమె మొదటి ప్రేమ ఎప్పుడూ సినిమాల్లో నటించడమే. పెళ్లి తర్వాత కూడా నటిస్తూనే ఉంటుంది. గతంలో మాదిరే మీ అందరి ప్రేమ,మద్దతు ఆమెకు అవసరం.' అని నికోలాయ్‌ అన్నారు.

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ.. 'ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నికోలాయ్ చెప్పినట్లు అయన నా ప్రేమ అయితే.. సినిమా నా జీవితం. కాబట్టి పెళ్లి తర్వాత కూడా తప్పకుండా సినిమాల్లో నటిస్తాను. మాకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)