Breaking News

సంధ్య థియేటర్ ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ కీలక ఆదేశాలు!

Published on Wed, 01/01/2025 - 20:59

అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) స్పందించింది. థియేటర్ వద్ద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేపట్టాలని తెలంగాణ డీజీపీని కోరింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..

డిసెంబర్‌ 4న తేదీన ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. పుష్ప-2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్‌ థియేటర్‌లో బెనిఫిట్ షో చూసేందుకు వెళ్లారు. ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున రావడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో రేవతి ‍అనే మహిళ మృత్యువాత పడింది. ఆమె కుమారుడు సైతం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

న్యాయవాది ఫిర్యాదుతో స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

అయితే ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది.  నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కోరింది. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)