Breaking News

హైదరాబాద్‌ తిరిగొచ్చిన నవ దంపతులు!

Published on Sat, 12/09/2023 - 11:10

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌ తనయుడు, టాలీవుడ్‌ యంగ్‌ హీరో అభిరామ్‌ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. వరుసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు. డిసెంబర్‌ 6న శ్రీలంకలో వీరి వివాహం ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు ఈ పెళ్లి తంతు నిర్వహించగా.. ఇరు కుటుంబసభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలిసింది. పెళ్లి సంబరాలు ముగియడంతో శుక్రవారం నాడు ఈ కొత్త జంట హైదరాబాద్‌కు తిరిగొచ్చింది.

ప్రత్యూష చక్కగా చీర కట్టుకోగా అభిరామ్‌ క్యాజువల్‌ తెలుపు షర్ట్‌, బ్లాక్‌ జీన్స్‌ వేసుకుని దర్శనమిచ్చాడు. ఈ జంట ఎయిర్‌పోర్టులో దిగి ఇంటికి బయల్దేరిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా ప్రకాశం జిల్లాలోని కారంచేడుకు చెందిన మాధవి-నగేశ్‌ చాపర్ల కూతురే ప్రత్యూష. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది.

ఇకపోతే సురేశ్‌బాబుకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో అబ్బాయి అభిరామ్‌ అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొద్దిరోజుల క్రితమే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలోనూ రిలీజైంది. అయితే ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో కొంతకాలం గ్యాప్‌ తీసుకున్నాకే సినిమాలు చేస్తానన్నాడు అభిరామ్‌.

చదవండి: ఆ హీరో సీరియల్‌ కిస్సర్‌.. కానీ మా మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల.

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)