Breaking News

ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్‌లో రెండు తెలుగు థ్రిల్లర్స్

Published on Tue, 07/29/2025 - 16:19

ప్రతివారంలానే ఈసారి కూడా ఓటీటీల్లోకి దాదాపు 20కి పైగా సినిమాలు వస్తున్నాయి. వాటిలో తమ్ముడు, 3 బీహెచ్‍‌కే లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు ఈ వీకెండ్‌లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో రెండు తెలుగు థ్రిల్లర్స్ కూడా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రాలేంటి? ఎందులోకి రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

కొన్నిరోజుల క్రితం తమిళ హారర్ ఫాంటసీ సినిమా 'జిన్ ద పెట్'.. సన్ నెక్స్ట్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆగస్టు 01 నుంచి తెలుగులోనూ చూడొచ్చని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్ట్ పెట్టింది. చిన్న వీడియో బిట్ కూడా రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)

'జిన్ ద పెట్' విషయానికొస్తే.. జిన్ అనే దెయ్యం ఉన్న పెట్టెని శక్తి(ముగెన్ రావ్).. తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే దీని వల్ల తన ఫ్యామిలీ కష్టాలపాలవుతుందని అనుకుంటాడు. కానీ బాక్స్‌లోని దెయ్యం వీళ్లకు సాయం చేస్తుంది. ఇంతకీ ఆ దెయ్యం సంగతేంటి? వీళ్లకు ఎందుకు సాయం చేస్తుందనేది మిగతా స్టోరీ.

'నెట్‌వర్క్' అనే టెక్నో థ్రిల్లర్ సిరీస్.. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  శ్రీరామ్ , శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించారు. మనకు రోజువారీ ఫోన్ అనేది చాలా అలవాటు అయిపోయింది. ఒకవేళ మన ఫోన్‪‌లో సిగ్నల్ రోజంతా మిస్ అయితే? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇలా నలుగురికి జరిగితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు సిరీస్ ఇది. థ్రిల్లర్స్ కావాలనుకునేవాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.

(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో ‍పక్కా చూడాల్సిన సినిమా)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)