Breaking News

చున్నీ లేదేంటి? నీకు బుర్ఖా వేయాల్సిందే.. హీరోయిన్‌పై ట్రోలింగ్‌

Published on Wed, 03/05/2025 - 21:21

హీరోయిన్‌ సనా ఖాన్‌ (Sana Khan) సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటోంది. యూట్యూబ్‌లో వ్లాగ్స్‌ చేయడంతోపాటు రంజాన్‌ స్పెషల్‌ పాడ్‌క్యాస్ట్‌ కూడా చేస్తోంది. సనా చేసే ఈ పాడ్‌కాస్ట్‌లోని ఓ ఎపిసోడ్‌లో నటి సంభావన సేత్‌ (Sambhavna Seth) కూడా భాగం కానుంది. ఈ ఎపిసోడ్‌ షూట్‌ చేయడానికి ముందు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 

దెబ్బలు పడ్తాయ్‌
అందులో సనా.. నీ డ్రెస్‌ మార్చుకుంటావా? అని అడగ్గా సంభావన లేదని చెప్పింది. అందుకామె నీ సల్వార్‌ కమీజ్‌ ఏమీ బాగోలేదు.. చెప్పింది వినకపోతే నీకు దెబ్బలు పడ్తాయి.. చున్నీ ఎక్కడుంది? ఎవరైనా బుర్ఖా తీసుకురండి. సంభావనకు బుర్ఖా వేయండి అని నవ్వుతూ చెప్పింది. అందుకు సంభావన.. నాకిప్పుడు ఏ డ్రెస్‌ కూడా పట్టదు. నేను చాలా బరువు పెరిగాను. దాదాపు 15 కిలోలు పెరిగుంటాను. అయినా జనాలు (పాడ్‌కాస్ట్‌లో) మనం ఏం మాట్లాడామన్నదే చూస్తారు కానీ మన దుస్తులు కాదు. మనం సహజంగా ఉంటేనే జనాలు ఇష్టపడతారు అని పేర్కొంది.

ఎందుకు ఒత్తిడి చేస్తున్నావ్‌?
వీళ్లు సరదాగా మాట్లాడుకున్నప్పటికీ జనాలకు సనా వైఖరి ఏమాత్రం నచ్చలేదు. అవతలివారు మీ వేషధారణను, పద్ధతులను గౌరవించాలంటే ముందుగా సనా కూడా అవతలివారిని గౌరవించాలి. సనా తన ఆలోచనలను, పద్ధతులను సంభావనపై రుద్దాలని చూడటం దారుణం.. ఎవరికి నచ్చినట్లు వారిని బతకనివ్వండి, ఆమె సల్వార్‌ ధరించలేదు, చున్నీ వేసుకోలేదు.. ఎందుకిదంతా.. ఆమెను బలవంతం చేయడానికి సనాకు ఏం హక్కు ఉంది? అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మజాక్‌ చేసిందంతే..
ఈ ట్రోలింగ్‌పై సంభావన స్పందిస్తూ.. సనా తన ఫ్రెండ్‌ అని, తను సరదాగా అన్న మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని సూచించింది. ఇద్దరు ఫ్రెండ్స్‌ అన్నాక.. సరదాగా వంద మాట్లాడుకుంటామని దాన్ని ట్రోల్‌ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. తనను బుర్ఖా వేసుకోమని సనా ఏమీ బలవంతం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. దయచేసి సనాను విమర్శించడం ఆపేయండని కోరింది.

సినిమా
సనా ఖాన్‌.. కత్తి, గగనం, మిస్టర్‌ నూకయ్య వంటి తెలుగు చిత్రాలతో పాటు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కొన్ని మూవీస్‌లో ఐటం సాంగ్‌లోనూ మెరిసింది. తర్వాత సడన్‌గా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. 2020 నవంబర్‌లో అనాస్‌ను పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన సోషల్‌ మీడియా నుంచి గ్లామరస్‌ ఫోటోలు, ట్రిప్పులకెళ్లిన వీడియోలు అన్నింటినీ డిలీట్‌ చేసింది. ప్రస్తుతం రంజాన్‌ మాసం కావడంతో సెలబ్రిటీల రంజాన్‌ అనుభవాలు తెలియజేస్తూ యూట్యూబ్‌లో ప్రత్యేక పాడ్‌కాస్ట్‌ చేస్తోంది.

 

 

చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్‌.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)