Breaking News

ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్‌.. 'ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అప్పుడే..!'

Published on Mon, 07/14/2025 - 09:20

కామెడీ పండిచడం చాలా కష్టమంటుంటారు. కానీ కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) అవలీలగా నవ్వించేయగలరు, గణేశ్‌ లాంటి సినిమాలతో భయపెట్టనూగలరు. ఇవి రెండూ మిక్స్‌ చేసేలా భయపెడుతూనే నవ్వించగలరు. 750కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇక సెలవంటూ వెళ్లిపోయారు. జూలై 13న ఫిలిం నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది.

భగవంతుడు పిలుస్తాడని అప్పుడే అనుకున్నా..
నటుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీతారలు భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాత బండ్ల గణేశ్‌ సైతం కోట ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించాడు. కొద్దిరోజుల క్రితమే ఆయన్ను కలిశానని, అప్పుడు ఆయన పరిస్థితి చూడలేకపోయానన్నాడు. భగవంతుడు పిలుస్తాడని ఆరోజే అనుకున్నానని మీడియాతో మాట్లాడాడు. కోటగారంటే ఇష్టమని, ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందంటూ నటుడి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

బండ్ల గణేశ్‌ పోస్ట్‌
అయితే అదే రోజు బండ్ల గణేష్‌ ఓ పోస్ట్‌ పెట్టగా.. దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలారోజుల తర్వాత స్నేహితులు ఇంటికొచ్చి కలిశారంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ ఫోటో షేర్‌ చేశాడు. అందులో శ్రీకాంత్‌, శివాజీరాజా, అలీ, ఉత్తేజ్‌ ఉన్నారు. వీళ్లందరూ వినోదం సినిమాలో కలిసి యాక్ట్‌ చేశారు. దీంతో ఇది చూసిన నెటిన్లు.. మీరందరూ వినోదం సినిమాకు సీక్వెల్‌ తీయండి, బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నారు.

నెటిజన్స్‌ ఫైర్‌
అయితే కొందరు మాత్రం.. పెద్దాయన (కోట శ్రీనివాసరావు) పొద్దున్నే కదా చనిపోయింది. మీరప్పుడే సిట్టింగ్‌ మొదలుపెట్టారా?, కానీ గ్లాసులు దాచేసి భలే కవర్‌ చేశారు, అయినా కోటగారు మరణించారన్న బాధ మీకు కాస్తయినా ఉంటే కదా? అని ఆగ్రహిస్తున్నారు. మరికొందరు మాత్రం..  ఫ్రెండ్స్‌ కలిస్తే తప్పేముందని, దానికి విమర్శలు చేయడమెందుకని బండ్ల గణేశ్‌ను సమర్థిస్తున్నారు.

చదవండి: Jr NTR: తెలుగు ఇండస్ట్రీకి కోట శ్రీనివాసరావు ఒక్కరే.. మళ్లీ ఇంకో కోట పుట్టరు, రారు..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)