Breaking News

సెల్ఫీకి అల్లు అర్జున్ నో.. ఎయిర్‌పోర్ట్‌లో అభిమానికి నిరాశ!

Published on Sat, 05/03/2025 - 17:14

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ఇటీవల ముంబయిలో సందడి చేశారు. ప్రతిష్టాత్మక వేవ్స్ సమ్మిట్‌-2025కు బన్నీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈ సమ్మిట్‌లో పంచుకున్నారు. సినీరంగంలో తనకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమంటూ కామెంట్స్ చేశారు. పుష్ప-2తో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం జవాన్ డైరెక్టర్‌ అట్లీతో జతకట్టనున్నారు. ఈ సినిమా బన్నీ కెరీర్‌లో 22వ చిత్రంగా రానుంది.

ఇదంతా పక్కన పెడితే వేవ్స్ సమ్మిట్‌కు వెళ్తూ మన ఐకాన్ స్టార్‌ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కారు దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లే సమయంలో  ఓ అభిమాని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అతనితో ఫోటో దిగేందుకు బన్నీ అనుమతించలేదు. అతన్ని పక్కనే ఉన్న సెక్యూరిటీ సైతం వద్దని వారించారు.

దీంతో అల్లు అర్జున్ వైఖరిపై నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని పోస్టులు పెడుతున్నారు. అభిమానులే లేకపోతే అసలు మీరు ఎవరు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. వెంటనే అల్లు అర్జున్‌ సినిమాలు చూడటం మానేయాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే మరికొందరు అల్లు అర్జున్‌కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. బిజీ షెడ్యూల్‌ వల్ల వారికి సమయం ఉండదని అంటున్నారు.
 

 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)