Breaking News

ఓలే ఓలే.. అన్ని బూతులే.. రవితేజ పాటపై విమర్శలు!

Published on Wed, 08/06/2025 - 16:27

ఓలే ఓలే గుంట
నీ అయ్యకాడ ఉంటా
నీ అమ్మకాడ తింటా
నీ వొళ్ళోకొచ్చి పంటా
బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు
మంచి లేదు మర్యాద లేదు
అంగీ లేదు లుంగీ లేదు పంచె లేదు
తాడు లేదు బొంగరం లేదు
నీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని... పట్టుకుని కాళ్లు మొక్కి పోతా

చదువుతుంటే ఇవేవో బూతు పదాల్లా అనిపిస్తున్నాయి కదా?.. కానీ ఇవి ఓ సినిమాలో ఉన్న జానపద గీతం లిరిక్స్‌.  ఓ స్టార్‌ హీరో ఈ పాటకు స్టెప్పులేశాడు. నెట్టింట  ఈ పాట తెగ వైరల్‌ అవుతుంది. కొంతమంది హీరోహీరోయిన్ల స్టెప్పులను ఎంజాయ్‌ చేస్తుంటే..మరికొంతమంది మాత్రం లిరిక్స్‌పై తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నారు.  జానపద పాట పేరుతో బూతు పాటలు వినిపిస్తున్నారంటూ మండిపడుతున్నారు.  

రవితేజ-శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్‌ జాతర’ లో ఈ  ఫోక్‌ సాంగ్‌ ఉంది. నిన్న పాటను విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే అది వైరల్‌ అయింది. యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది నెటిజన్స్‌ మాత్రం లిరిక్స్‌పై మండిపడుతున్నారు.  'నీ య‌మ్మ‌...అక్క‌, త‌ల్లి, చెల్లి...'  'బుద్ది, జ్ఞానం సిగ్గు, శ‌రం లేదు...' లాంటి బూతుల‌తోనే పాటని కంపోజ్‌ చేయడం, దానికి రవితేజ లాంటి స్టార్‌ హీరో డ్యాన్స్‌ చేయడం దారుమని కామెంట్‌ చేస్తున్నారు.  ‘జానపదం లో ఇలాంటి పదాలు అసలు బూతులు కావంటూ మరికొంతమంది రవితేజకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. 

 


ఈ మధ్య సినిమాలో జానపద పాటలు ఎక్కువగా వాడేస్తున్నారు. స్టార్‌ హీరోలు సైతం ఫోక్‌ సాంగ్‌కి స్టెప్పులేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ మాత్రమే సినిమాల్లో కనిపించేవి. ఇప్పుడు ఉత్తరాంధ్ర జానపద పాటలకు కూడా స్టార్స్‌ స్టెప్పులేస్తున్నారు. అవి బాగా వర్కౌట్‌ అవుతున్నాయి కూడా. అందుకే తాజాగా రవితేజ కూడా ఓ ఉత్తరాంధ్ర ఫోక్‌ సాంగ్‌కి స్టెప్పులేశాడు. రోహిణితో క‌లిసి మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ ఈ పాట‌ను పాడాడు. 

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)