Breaking News

'అత్తమ్మాస్‌ కిచెన్‌'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్‌

Published on Wed, 05/15/2024 - 14:06

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి  సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'అత్తమ్మాస్‌ కిచెన్‌' పేరుతో ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా 'అత్తమ్మాస్‌ కిచెన్‌'తో నిర్వచించారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్‌ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా 'అత్తమ్మాస్‌ కిచెన్‌' కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు. అవి ఆన్‌లైన్‌లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి.

తాజాగా 'అత్తమ్మాస్ కిచెన్' పేజీ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు. అందులో తన అత్తగారు అయిన పద్మతో కలిసి లావణ్య త్రిపాఠి కనిపించారు. కొత్త ఆవకాయ్‌ పచ్చడిని తయారు చేస్తూ ఫోటోలు దిగారు. అయితే, ఆ ఫోటోలపై కొందరు కామెంట్లు చేశారు. 'అత్తమ్మాస్ కిచెన్' ప్రొడక్ట్‌ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. ఆవకాయ్‌ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఆపై వారి జుట్టుని కూడా అలా వదిలేశారు. అందులో హెయిర్‌ పడితే పరిస్థితి ఏంటి..? ఏ మాత్రం హైజీన్‌ పాటించడం లేదంటూ విమర్శలు చేశారు. 

దీంతో అత్తమ్మాస్‌ కిచెన్‌ పేజీ నుంచి నెటిజన్లకు తిరిగి సమాధానం వచ్చింది. వాస్తవంగా కస్టమర్స్‌ కోసం చేసేటప్పుడు చాలా హైజీన్‌ పాటిస్తామని తెలిపారు. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్‌ కాబట్టి అలా కనిపించారని తెలిపారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, అవి చాలా హైజిన్‌గా మెయింటైన్ చేస్తామని ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని వారు చెప్పారు.

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)