Breaking News

OG మూవీలో హీరోయిన్‌కు అన్యాయం

Published on Thu, 09/25/2025 - 14:04

టాలీవుడ్‌ హీరోయిన్‌ నేహా శెట్టి (Neha Shetty)కి అన్యాయం జరిగింది. కథానాయికగా తన సినిమాలేవో తను చేసుకుంటున్న ఈ బ్యూటీకి ఐటం సాంగ్‌ ఆఫర్‌ వచ్చింది. అదీ ఓజీ మూవీ (They Call Him OG Movie)లో! హీరోయిన్‌గా తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోయినా సరే.. పవన్‌ కల్యాణ్‌ కోసం తొలిసారి స్పెషల్‌ సాంగ్‌కి ఓకే చెప్పింది. అలా థాయ్‌లాండ్‌లో ఈ పాటను చిత్రీకరించారు. 

సర్‌ప్రైజ్‌ ఉంటుందన్న బ్యూటీ
ఈ సాంగ్‌లో పవన్‌తో కలిసి స్టెప్పులేసిందీ బ్యూటీ! ఈ విషయాన్ని తనే పరోక్షంగా బయటపెట్టింది. ఇటీవల ఓ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు తన నెక్స్ట్‌ సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. నా సినిమాల గురించి తర్వాత ప్రకటిస్తాను. ఇప్పుడైతే నవంబర్‌లో ఓజీ మూవీ వస్తుంది కదా.. అందులో ఒక సర్‌ప్రైజ్‌ ఉంది. అది చూసి మీరందరూ సంతోషిస్తారనుకుంటున్నాను అంది. కట్‌ చేస్తే ఓజీ మూవీలో ఆ స్పెషల్‌ సాంగ్‌నే తీసేశారు. అది చూసి నేహా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. 

ఎడిటింగ్‌లో తీసేశారా?
ఎడిటింగ్‌లో నేహా శెట్టినే లేపేయడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి యూట్యూబ్‌లో అయినా ఆ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుందేమో చూడాలి! ఓజీ విషయానికి వస్తే.. సాహో ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌). పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా యాక్ట్‌ చేశాడు. 

ఓజీ రిలీజ్‌
శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ మూవీ నేడు (సెప్టెంబర్‌ 25న) ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటోంది. నేహా శెట్టి విషయానికి వస్తే.. డీజే టిల్లు మూవీలో రాధికగా విపరీతమైన క్రేజ్‌ అందుకుంది. టిల్లు స్క్వేర్‌లోనూ అతిథి పాత్రలో తళుక్కుమని మెరిసింది. రూల్స్‌ రంజన్‌, బెదురులంక 2012, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమాలు చేసింది. ఈ ఏడాది ఏ సినిమాలోనూ కనిపించలేదు.

చదవండి: They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)