Breaking News

షారుక్‌ బాద్‌షా.. నేను రాధిక: నేహా శెట్టి

Published on Tue, 05/28/2024 - 00:02

‘‘మనం పోషించిన పాత్రల పేరుతో ప్రేక్షకులు మనల్ని పిలవడం ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్‌ ఖాన్‌గారిని బాద్‌షా అని పిలుస్తారు. డీజే టిల్లు’ చిత్రంలో నేను పోషించిన రాధిక పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  నా కెరీర్‌ ప్రారంభంలోనే రాధిక అని పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది.. దాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్‌ నేహా శెట్టి అన్నారు. విశ్వక్‌ సేన్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. 

నేహా శెట్టి, అంజలి కథానాయికలు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ–‘‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మూవీ ఒక కుటుంబ ప్రయాణంలా ఉంటుంది. రత్న, రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మూవీలో 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి బుజ్జి పాత్ర చేశా.

90లలో సాగే ఈ క్యారెక్టర్‌ కోసం డైరెక్టర్‌గారు నటి శోభనగారిని రిఫరెన్స్గా చూపించారు. బుజ్జి పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చి పెడుతుంది. అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవిగారు గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలాగా ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వక్‌ సేన్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అనుభవం గల నటిగా అంజలిగారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కృష్ణ చైతన్యగారు ఈ మూవీని తెరకెక్కించిన విధానం అద్భుతం. సితార సంస్థలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి జోడీగా ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)