Breaking News

ఓటీటీలో విడుదల కానున్న నయనతార, మీరా జాస్మిన్‌ సినిమా

Published on Sat, 10/05/2024 - 08:28

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్'.  ఈ సినిమాతో నిర్మాత శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వైనాట్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. గతేడాదిలో జవాన్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న నయనతార ఈ ఏడాదిలో వరుస సినిమాలతో అభిమానులను మెప్పించనుంది.

ది టెస్ట్‌ సినిమా గురించి తాజాగా చిత్ర యూనిట్‌ ఒక ప్రకటన చేసింది. జీవితాన్ని ఆడించే ‘టెస్ట్‌’ ఆట ముగిసిందంటూ  ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపింది. ఈ మూవీలో  నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. మీరా జాస్మిన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్‌ కనిపించనుంది.

తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో ది టెస్ట్‌ సినిమా విడుదల కానుందని సమాచారం. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్‌ కూడా త్వరలో  అధికారికంగా ప్రకటించనున్నట్లు  సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తర్వాత నయన్‌ చేతిలో డియర్‌ స్టూడెంట్స్‌, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)