Breaking News

నయనతార సడన్‌ సర్‌ప్రైజ్‌.. స్టేజ్‌పై భర్త ఎమోషనల్‌

Published on Wed, 04/08/2026 - 08:49

సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార సినిమాలు చేస్తుంది, కానీ ప్రమోషన్స్‌పై పెద్దగా ఆసక్తి చూపదు. సినిమాల్లో నటించడం వరకే తన పని అన్నట్లుగా తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇటీవల చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ కోసం మాత్రం ఆ రూల్‌ బ్రేక్‌ చేసింది. ప్రమోషనల్‌ వీడియోలో కనిపించడంతో పాటు సక్సెస్‌మీట్‌లోనూ పాల్గొని సందడి చేసింది.

సర్‌ప్రైజ్‌
తాజాగా మరోసారి ప్రమోషన్స్‌లో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. నయనతార నిర్మిస్తున్న తాజా చిత్రం లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ. ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ మంగళవారం (ఏప్రిల్‌ 7న) గ్రాండ్‌గా జరిగింది. విఘ్నేశ్‌ మాట్లాడుతున్న సమయంలో నయన్‌ సడన్‌గా స్టేజీపై ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఆమె రాకను చూసి విఘ్నేశ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. 

వీడియో వైరల్‌
భార్యను కొద్ది క్షణాల పాటు హత్తుకుని షాక్‌లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త కోసమే నయన్‌ ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్‌ఐకే  (Love Insurance Kompany Movie) విషయానికి వస్తే.. లవ్‌టుడే ఫేమ్‌ ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించాడు. ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా యాక్ట్‌ చేసింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ మూవీ ఏప్రిల్‌ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Videos

బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...

భారతీయులు ఇరాన్ వదిలి వెళ్లిపోండి

ఎన్నికల సంఘం-TMC ఎంపిల సమావేశంలో రసాభాస

నా భార్యను పక్కన కూర్చోపెట్టుకుని చెప్తున్నా... ABN రాధాకృష్ణ పై విరుచుకుపడ్డ రాచమల్లు

వెనక్కి తగ్గిన ట్రంప్.. సీజ్ ఫైర్ వెనుక కారణమిదేనా?

చేసిందంతా వైఎస్సారే.. హంద్రీ-నీవాపై 'చంద్ర' నాటకం

విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ETFలో ఇన్వెస్ట్ చేసినవారికి పండగే... భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్

కువైట్ వైపు దూసుకొస్తున్న భారీ మిస్సైల్స్..

Photos

+5

చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌ (ఫోటోలు)

+5

డెకాయిట్‌ కోసం వచ్చేసిన వెంకీ మామ (ఫోటోలు)

+5

అందమైన అల్లుడిని తెచ్చా..: రష్మిక మందన్నా (ఫోటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంగేజ్‌మెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. బన్నీ అరుదైన రికార్డులివే! (ఫోటోలు)

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)