Breaking News

మళ్లీ డుమ్మా కొట్టిన నయనతార..! అభిమానులకు నిరాశ

Published on Fri, 10/30/2026 - 15:05

లేడీ సూపర్‌స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విమర్శలు చాలా కాలంగానే ఉన్నాయి. అయితే  ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో పాటు.. ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనూ ఆమె సందడి చేశారు. దీంతో ఇకపై నయనతార కూడా సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటారని అభిమానులు భావించారు. అయితే తాజాగా మరోసారి తన పాత పంథానే కొనసాగించినట్లు తెలుస్తోంది.  ‘మూకుత్తి అమ్మన్ 2’( తెలుగులో మహాశక్తి) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆమె హాజరుకాకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

నిర్మాతగా ఉన్నప్పటికీ..
భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ప్రచార కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నయనతార కూడా రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె.. సినిమా వేడుకకు ఎందుకు హాజరుకాలేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే నయనతార ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని తెలిపింది. మరోవైపు సినిమా చిత్రీకరణ సమయంలో నయనతార నాన్‌వెజ్‌కు దూరంగా ఉన్నారని దర్శకుడు సుందర్ సి వెల్లడించారు.

కాగా కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘మూకుత్తి అమ్మన్ 2’ ఒకటి.  సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు వేల్స్ ఇంటర్నేషనల్‌తో పాటు సుందర్ సి, నయనతార నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండగా.. రెజీనా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.  నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ ‘డ్రాగన్’ ఓ అణుబాంబు.. ఈసారి మాత్రం : రాజీవ్ కనకాల)

Videos

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర..

పెను ముప్పు పొంచి ఉందా? US, UK, జ‌పాన్ జారీ చేసిన రెడ్ అల‌ర్ట్!

అందుకే టీడీపీకి రాజీనామా చేశా... కడప టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జమ్మలమడుగులో హై టెన్షన్ YSRCP నేత కారుపై దాడి

చిలకలూరిపేట ప్రచారంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు!

YSRCP ఏజెంట్ కు ఎన్నికల అధికారి బెదిరింపులు..! ఆడియో వైరల్..

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)