Breaking News

50 సెకన్ల ప్రకటన.. అదిరిపోయే రేంజ్‌లో 'నయనతార' రెమ్యునరేషన్‌

Published on Sat, 07/12/2025 - 07:01

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది పాత సామెతే అయినా ఎవరైనా ఎప్పుడూ అమలు పరచేదే. ఇందుకు సంచలన తార నయనతార అతీతం కాదు. ఈమె చాలా కష్టపడి కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన నటి. కేరళలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నటనపై ఆసక్తితో పలు అవమానాలు, అవరోధాలు ఎదుర్కొని కథానాయకిగా నిరూపించుకున్నారు. అయితే దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణిస్తానని బహుశ ఆమె కూడా ఊహించి ఉండరు. కోలీవుడ్‌లో అయ్యా చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న నయనతార ఆ తరువాత రజనీకాంత్‌కు జంటగా చంద్రముఖి చిత్రంలో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగపోతున్నారు. 

ఈమె మొదటి నుంచి సంచనాలకు చిరునామా అని చెప్పవచ్చు. మొదట్లో ప్రేమ, ఆ తరువాత పెళ్లి, ఆపై సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లి, నిర్మాత ఇలా ఒక్కో ఘట్టంలోనూ వివాదాలు, విమర్శలను తొక్కుకుంటూ తన స్థాయిని నిలబెట్టుకుంటున్న నయన్‌ ఇప్పటికీ స్టార్‌ హీరోలతో జత కడుతూ బిజీగా ఉన్నారు. ఈ భామ చిత్రానికి రూ.10 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనలో నటించడానికి ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం సాయాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అంటే ఈమె ఒక సెకన్‌ పారితోషకం అక్షరాల రూ.10 లక్షలు అన్నమాట. 

అయితే, ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిందని సమాచారం.  నయనతార సాధారణంగా యాడ్స్‌ చేయడం చాలా అరుదు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పుడు మాత్రమే యాడ్స్‌ చేస్తారు. ఇది చూసి ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్‌కు అంత రెమ్యునరేషన్ తీసుకోరు. నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్‌కు తగ్గట్టే దూసుకుపోతున్నారు. ఇకపోతే కోలీవుడ్‌లో ఇటీవల నయన చిత్రాలేమీ విజయాలను సాధించలేదు. అయినప్పటికీ ఈమె క్రేజ్‌ ఏమాత్రం దగ్గలేదనడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది తెరపైకి రావడానికి ఆ చిత్రం సిద్ధం అవుతోంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)