Breaking News

ఐదోసారి ఆ స్టార్‌ హీరో సినిమాలో నయనతార.. భారీ రెమ్యునరేషన్‌

Published on Fri, 05/24/2024 - 09:13

సౌత్‌ ఇండియాలో నయనతార జోరు మామూలుగా లేదుగా. నాలుగు పదుల వయసు.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. చేతి నిండా చిత్రాలు.. పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీ. ఇంకోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోవడం, ఇదీ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రస్తుత పొజిషన్‌. ఇటీవల నయనతార నటించిన చిత్రాలు పెద్దగా ఆడకపోవచ్చునేమోగానీ, ఆమె క్రేజ్, అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఈ భామ హిందీలో షారూక్‌ఖాన్‌ సరసన నటించిన జవాన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించడం, ఆ తరువాత వరుసగా అవకాశాలు తలుపు తట్టడమే. 

ప్రస్తుతం నయనతార నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం మన్నాంగట్టి సిన్స్‌ 1960 చిత్రాన్ని పూర్తి చేశారు. మరో పక్క మాధవన్, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తున్న టెస్ట్‌ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తాజాగా హీరో అజిత్‌ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారనే టాక్‌ వైరల్‌ అవుతోంది. అజిత్, నయనతారలది సూపర్‌హిట్‌ జంట అనే చెప్పాలి. వీరిద్దరూ ఇప్పటికి ఏగన్, బిల్లా, ఆరంభం, విశ్వాసం తదితర నాలుగు చిత్రాల్లో నటించారు. వీటిలో ఏగన్‌ చిత్రం మినహా మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 

తాజాగా ఈ జంట ఐదోసారి జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అజిత్‌ ప్రస్తుతం విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తరువాత ఆయన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఆధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే టైటిల్‌ను ఖారారు చేసిన విషయం తెలిసిందే. దీనికి సినీ వర్గాలు, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇందులో అజిత్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఆయనకు జంటగా టాలీవుడ్‌ హీరోయిన్‌  శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అలాంటిది తాజాగా ఈ వరుసలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార పేరు వినిపించడం విశేషం. అంతే కాదు ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం జూన్‌ నెలలోనే సెట్‌పైకి వెళ్లనుందని, ఈ చిత్రం తొలి షెడ్యూల్‌లో నయనతార మూడు రోజులు పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రం కోసం ఈ భామ పారితోషకాన్ని ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఆ చిత్రం కోసం నటుడు అజిత్‌ రూ.163 కోట్లు పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే టాలీవుడ్‌ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం చాలా కాస్టీలీ గురూ అంటున్నారు నెటిజన్లు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)