Breaking News

నయనతారపై కేసు నమోదు

Published on Thu, 01/11/2024 - 13:37

సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన కెరియర్‌లో  బెంచ్‌మార్క్‌ చిత్రంగా 'అన్నపూరణి' గతేడాది డిసెంబరు 1న విడుదలైంది. తన సినీ జీవితంలో 75వ సినిమాగా  'అన్నపూరణి' ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీ విడుదల రోజు నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో థియేటర్‌లలో కూడా అంతగా మెప్పించలేక పోయింది.

కొద్దిరోజుల క్రితం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తమిళ్‌, తెలుగు,హిందీ, మలయాళంలో  స్ట్రీమింగ్ అవుతోంది. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉందంటూ ఫిర్యాదులు రావడంతో  'అన్నపూరణి' చిత్రాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ తొలగించింది. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆరోపించారు.

సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరాడు. ఈ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను నిర్మించారని..  అన్నపూరణి దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార, నిర్మాతలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అటు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హిందూసేవ పరిషత్‌ ఫిర్యాదు మేరకు అన్నపూరణి చిత్రయూనిట్‌తో పాటు, నెట్‌ఫ్లిక్స్‌పైనా కేసు నమోదైంది. ఇలా ఈ చిత్రంపై వరుస వివాదాలు ముసురుకోవడంతో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గి అన్నపూరణి చిత్రాన్ని తొలగించేసింది. 

'అన్నపూరణి' కథేంటి?
తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్(అచ్యుత్ కుమార్) చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి (నయనతార). చిన్నప్పటి నుంచే తండ్రిని చూస్తూ చెఫ్ కావాలని అనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె.. నాన్ వెజ్ ముట్టుకోవడం కూడా పాపం అని తండ్రి అంటాడు. మరి చిన్నప్పటి నుంచి అనుకున్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? చివరకు అనుకున్నది సాధించిందా లేదా? అనేది తెలియాలంటే 'అన్నపూరణి' మూవీ చూడాల్సిందే.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)