Breaking News

వరద బాధితులకు నయనతార సాయం.. అయినా తప్పని విమర్శలు

Published on Fri, 12/08/2023 - 11:26

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షం తగ్గినా ఇంకా చాలా చోట్ల వరద ప్రభావం కొనసాగుతోంది. అక్కడ ప్రజల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. చాలా ప్రాంతంలో  ఇంట్లోకి నీళ్లు రావడంతో నిత్యవసర అవసరాలకు చాలా ఇబ్బందలు పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం జారవిడుస్తున్నా కూడా సమస్య తీరడం లేదు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల సాధారణ ప్రజలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు.

పునరావాస కేంద్రాల్లో వేలాదిగా తుపాను బాధితులు కనీస అవసరాలు తీరక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పలువురు స్వచ్ఛంద సేవకులు, సినీ సెలబ్రిటీలు సాయం చేసేందకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విజయ్‌,సూర్య,విశాల్‌  ఫ్యాన్స్‌ తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ హీరోయిన్‌ నయనతార సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తన వ్యాపార సంస్థ అయిన ‘ఫెమీ 9’ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. దుస్తులు,ఆహారం, శానిటరీ న్యాప్‌కిన్లు, వాటర్ బాటిళ్లు, మెడిసిన్స్‌,పాలు వంటి వాటిని ఆమె అందించింది.

(ఇదీ చదవండి: తిరుపతిలో బిగ్‌ బాస్‌ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం)

దీంతో ఆమెకు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు అభినందనలు తెలిపారు. కానీ మరికొందరు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు. తన కంపెనీకి చెందిన ‘ఫెమీ 9’ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులతో ఉన్న వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడం ఏంటి..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా కంపెనీని ప్రమోట్ చేసుకోవడం ఏంటి అంటూ నయనతారపై విమర్శలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం నయన్‌కు విపరీతంగా సపోర్ట్‌ చేస్తున్నారు.

ఆమె కంపెనీకి చెందిన కాస్మోటిక్స్‌ను ఆ వాహనాల ద్వారానే ట్రాన్స్‌పోర్టు చేస్తుంటారు. ప్రజలకు సాయం చేసేందుకు అందులోని సామాన్లను ఖాళీ చేసి ప్రజలకు అవసరమైన సామాగ్రిని తీసుకొని వచ్చినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తన కంపెనీకి ఉన్న డ్రైవర్లు అయితే ఈ పనిని కరెక్ట్‌ చేయగలుగుతారని భావించే నయన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయంలో కూడా ఇలా నయన్‌ను తప్పుబట్టడం ఏంటి..? అని కొందరు తిప్పికొడుతున్నారు. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)