Breaking News

ఇంతందం దానివల్లేనా? నయనతార బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే!

Published on Tue, 06/06/2023 - 08:35

సంచలనం అన్న పదానికి మారు పేరు నయనతార అనవచ్చు. ఎక్కడో కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి, ఆశనిరాశల మధ్య నటిగా మారి, అవమానాలు, విమర్శల నడుమ కథానాయికగా ఎదిగి, ఇప్పుడు క్రేజీ ఇండియన్‌ హీరోయిన్‌గా వెలిగొందుతోంది. దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేస్తున్న లేడీ సూపర్‌ స్టార్‌గా నిలిచింది. నాలుగు పదుల వయసును టచ్‌ చేయనున్న నయనతార ఇప్పటికీ ఫిట్‌నెస్‌లో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతోంది.

పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు తల్లి (సరోగసి విధానం ద్వారా) అయినా నయనతార ఇప్పటికీ కథానాయికగా నటిస్తూనే ఉంది. అందంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌ రహస్యం వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.. నయనతార బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి కారణం జిమ్‌ వర్కౌట్స్‌, యోగాలే. ముఖ్యంగా నయనతార ఫిట్‌నెస్‌కు యోగా బాగా ఉపకరించింది.

ఈమె నిత్యం రెండు గంటలు యోగా చేస్తుందట. అలాగే ఈమె డైట్‌ ప్లానింగ్‌లో కచ్చితంగా కొబ్బరినీళ్లు ఉండాల్సిందేనట. ఉదయం అల్పాహారంలో పళ్ల రసం తప్పనిసరి. పళ్లరసం బరువును తగ్గించడంతోపాటు ఎనర్జీ పెరగడానికి దోహదపడుతుంది. మధ్యాహ్నం భోజనంలో నాన్‌ వెజ్‌, గుడ్డు, కాయగూరలు సమపాళ్లలో తీసుకుంటుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ కలిగిన పదార్థాలను దూరంగా పెడతుందట. ఇకపోతే రోజుకు 8 గంటలు నిద్ర పోవడమనే అలవాటును క్రమం తప్పకుండా పాటిస్తుందట. మంచి నిద్రవల్ల కూడా బరువును కంట్రోల్‌లో ఉంచుతుందన్నమాట!

చదవండి: సన్మానం చేస్తే తినడానికి అరటిపండ్లు తేవొచ్చుగా అని దీనంగా అడిగిన టంగుటూరి!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)