Breaking News

ఆ డైరెక్టర్‌ కోసం రూల్స్‌ బ్రేక్‌ చేసిన 'నయనతార'

Published on Sun, 06/30/2024 - 18:27

ఒక సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినా అది జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్‌ తప్పనిసరి.  ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే పోస్టర్‌లు, టీజర్‌, ట్రైలర్‌ అంటూ ప్రేక్షకులకు దగ్గర చేస్తారు. అన్నింటికి మించి సినిమా విడుదలకు ముందు అందులో నటించిన నటీనటులతో ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో వారందరూ కూడా హాజరవడం జరుగుతుంది. కానీ లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. చివరకు తను నటించిన చిత్రాల కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనదు. ఒక ప్రాజెక్ట్‌కు సంతకం పెట్టే సమయంలోనే ప్రమోషన్స్‌ కార్యక్రమాలకు రానని ముందే స్పష్టంగా చెప్పి రూల్‌ పెట్టేస్తుంది.

చిరంజీవి,షారూఖ్‌ఖాన్‌ వంటి స్టార్స్‌తో నటించిన నయనతార వారితో పాటు ఎలాంటి ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ తాజాగా ఒక డైరెక్టర్‌ కోసం తన రూల్‌ను బ్రేక్‌ చేసింది నయనతార. కానీ తెలుగులో పవన్‌ కల్యాణ్‌ నటించిన 'పంజా' సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ కోసం ఆమె ఒక ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా విష్ణువర్ధన్  'నేసిప్పయ' అనే సినిమా తీశారు. అందులో అదితి శంకర్ ప్రధాన పాత్ర పోషించింది. కానీ ఈ సినిమాకు పెద్దగా బజ్‌ లేదు. దీంతో ఈ సినిమా ప్రమోషన్‌ కోసం నయనతారను కోరితే ఆమె ఒప్పేసుకుంది. 

అందుకు ఒక కారణం కూడా ఉంది అని చెప్పవచ్చు. విష్ణువర్ధన్ తమిళ్‌లో బిల్లా సినిమాను డైరెక్ట్‌ చేశాడు. ఆ చిత్రంలో నయనతారను ఎంపిక చేయడం వల్ల ఆమె కెరియర్‌ మారిపోవడం జరిగింది. ఆ సినిమా తర్వాత నయనతారకు భారీగా డిమాండ్‌ పెరిగింది. వరుసుగా సినిమా ఆఫర్లు క్యూ కట్టేశాయ్‌. అలా ఇప్పుడు అభిమానులు లేడీ సూపర్ స్టార్‌గా పిలుచుకునే రేంజ్‌కు నయనతార చేరుకుంది. ఆ అభిమానంతోనే నయనతార తన రూల్స్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడు కావడం వల్లే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు నయన్‌ చెప్పుకొచ్చింది.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)