Breaking News

అన్నపూరణి ఆగింది 

Published on Fri, 01/12/2024 - 00:53

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అన్నపూరణికి దేశంలోనే నంబర్‌ వన్‌ చెఫ్‌ కావాలన్నది ఆశయం. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మాంసాహార వంటలు చేసేందుకు సిద్ధం అవుతుంది. అది మాత్రమే కాదు.. ముస్లిమ్‌ యువకుడితో ప్రేమలో పడుతుంది. నయనతార టైటిల్‌ రోల్‌లో నటించిన ‘అన్నపూరణి’ చిత్రం ప్రధానాంశం ఇది. ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ఉపశీర్షిక. నీలేష్‌ కృష్ణ దర్శకత్వంలో జతిన్‌ సేథీ, ఆర్‌. రవీంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలై, అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీ ప్రేక్షకులను కొంత ఆకట్టుకోగలిగింది.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కానీ ఓ బ్రాహ్మణ యువతి మాంసాహారం వండటం, ముస్లిమ్‌ యువకుడితో ప్రేమలో పడటం అనే కథాంశం వివాదమైంది. పైగా రాముడు కూడా మాంసాహారం తిన్నాడన్నట్లు, వాల్మీకి అయోధ్య కాండలో ఉందన్నట్లు ఓ డైలాగ్‌ కూడా ఉంది. ఓ దేవత (అన్నపూర్ణ) మీద టైటిల్‌ పెట్టి ఇలాంటి సినిమా తీయడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దాంతో ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని కొందరు బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్‌ మొదలుపెట్టారు. అలాగే మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్‌ సోలంకి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నయనతారపై కూడా కేసు నమోదైంది. వివాదం పెద్దదవుతుండటంతో ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఆ విధంగా ఓటీటీలో ‘అన్నపూరణి’ ఆట ఆగింది.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)