Breaking News

నయనతార, కవిన్‌ కొత్త సినిమా టైటిల్‌ ఎలా ఉందంటే..?

Published on Fri, 10/10/2025 - 12:55

నయనతార కథానాయకిగా, కవిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్‌'.. జి.స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణుఎడవన్‌ కథ, దర్శకత్వం  నిర్వహిస్తున్నారు. ఈయన దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ వద్ద ఖైదీ, మాస్టర్, విక్రమ్‌ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారన్నది గమనార్హం. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, ప్రభు, రాధిక, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి ఇతర సినీ ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

నయనతార, కవిన్‌ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో హాయ్‌పై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు తాజాగా విడుదల చేశారు.  పోస్టర్‌ కొత్తగా ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని యూనిట్‌ సభ్యులు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ప్రేమ, వినోదం కలగలిపిన  సహజత్వంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని  పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి 20 రోజులపాటు షూటింగ్‌ నిర్వహించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి జెన్‌ మార్టిన్‌ సంగీతాన్ని, రాజేష్‌ శుక్లా చాయాగ్రహణం అందిస్తున్నారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)