Breaking News

రొమాన్స్‌కు వయసుతో పనేంటి?.. ట్రోల్స్‌పై హీరో స్ట్రాంగ్ కౌంటర్

Published on Tue, 06/20/2023 - 19:23

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, అవనీత్‌ కౌర్‌ జంటగా నటించిన చిత్రం టిక్కు వెడ్స్ షేరు. ఈ చిత్రానికి సాయి కబీర్‌ దర్శకత్వం వహించగా.. కంగనా రనౌత్‌ నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది చిత్రబృందం. అయితే ట్రైలర్‌లో హీరోయిన్‌ను నవాజుద్దీన్‌ కిస్ చేయడంపై విమర్శలొచ్చాయి. 50 ఏళ్ల నటుడితో 21 ఏళ్ల అమ్మాయికి రొమాంటిక్ సీన్స్ ఏంటని కొందరు ట్రోల్స్ చేశారు. తాజాగా ఆ సీన్‌పై వస్తున్న విమర్శలకు నవాజుద్దీన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవాజుద్దీన్‌ విమర్శలపై స్పందించారు.

(ఇది చదవండి: ఎంగేజ్‌మెంట్‌ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! )

నవాజుద్దీన్ మాట్లాడుతూ..'హీరో, హీరోయిన్లకి ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు. రొమాన్స్‌కు వయసుతో సంబంధం లేదు.  ముఖ్యంగా ఇప్పుడున్న  బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్ ఇప్పటికీ రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్‌ హీరోలు పనికిరాని వారు కాబట్టే. వారికేదో రొమాన్సే తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లవ్‌, బ్రేకప్‌ అన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. జీవితంలో రొమాన్స్‌ ఎవరైతే చేస్తారో.. వాళ్లు మాత్రమే ఇలాంటి సీన్స్ చేయగలరు.' అని‍ కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు.

కాగా.. టికు వెడ్స్ షేరు మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ నెల 23న విడుదల కానుంది. నవాజుద్దీన్ ప్రస్తుతం వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న సైంధవ్‌లో  విలన్‌గా నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వికాస్‌ మాలిక్‌గా కనిపించనున్నారు.

(ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్‌ సంచలన నిర్ణయం.!)

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు