Breaking News

నటుడి ఇంట్లో పనిమనిషి.. ఆహారం లేక అవస్థలు..!

Published on Sun, 02/19/2023 - 16:49

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంటి పనిమనిషి దుబాయ్‌లో అవస్థలు పడుతోంది. తినడానికి ఆహారం లేక దుర్భరమైన జీవితం అనుభవిస్తోంది. ఈ విషయాన్ని నవాజుద్దీన్ భార్య ఆలియా తరఫు న్యాయవాది తన ట్విటర్‌లో షేర్ చేశారు. సప్నా ఏడుస్తూ చెబుతున్న వీడియోను షేర్ చేస్తూ.. ఆమె ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయిందని పేర్కొన్నారు. దుబాయ్‌లో నవాజుద్దీన్ ఇంటిలో అతని పిల్లలను చూసుకునేందుకు సప్నా అనే అమ్మాయిని నవంబర్‌లో 2022లో నియమించుకున్నారు.

అయితే ట్విటర్‌లో సప్నా నియామకానికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ కూడా ఉంది. వీసా ఫీజుల పేరుతో నవాజుద్దీన్ ఆమెకు కనీసం జీతం కూడా ఇవ్వడం లేదని ఆలియా తరఫున న్యాయవాది ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సప్నా దగ్గర తినడానికి తిండి,  డబ్బు లేదని వివరించారు. సప్నాను ఓ కెంపెనీలో సేల్స్ మేనేజర్‌గా నియమించుకున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా బాలికను ఇండియాకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది రిజ్వాన్ అధికారులను కోరారు. నవాజుద్దీన్‌తో సప్న దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. సప్నా తనకు పెండింగ్‌లో ఉన్న జీతం చెల్లించాలని.. భారతదేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాటు చేయాలని నవాజుద్దీన్‌ను వీడియోలో కోరింది.

కాగా..  నవాజుద్దీన్ భార్య ఆలియా, అతని పిల్లలు షోరా, యాని 2021లో దుబాయ్‌కి వెళ్లారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఆలియా భారతదేశానికి తిరిగి వచ్చారు. అతని అంధేరి బంగ్లాలో ఉంటున్నారు.మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్య ఆలియాతో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చిన ఆలియా తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)