Breaking News

అనుష్కతో హగ్స్‌.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్‌

Published on Wed, 08/23/2023 - 08:07

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది.

తాజాగ నవీన్ పొలిశెట్టి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. షూటింగ్ ప్రారంభంలో అనుష్క లాంటి స్టార్‌ హీరోయిన్‌ పక్కన నటించడం అంత సులభం కాదని నవీన్‌ తెలిపాడు. దీంతో షూటింగ్‌ ప్రారంభంలో మొదటి 2 రోజులు కాస్త ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పాడు. ఆ తర్వాత నుంచి అనుష్క అందించిన ఎంకరేజ్‌మెంట్‌తో ఎలాంటి బెరుకు లేకుండా ఆమెతో కలిసిపోయానని చెప్పాడు. అలా షూటింగ్ మొత్తం సరదాగా సాగిపోయిందని గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమా వల్ల తామిద్దరం మంచి ఫ్రెడ్స్‌ అయ్యాం. సినిమాలో తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని నవీన్ పేర్కొన్నాడు.

అనుష్క లాంటి స్టార్‌ నటితో కలిసి నటించారు కదా ఆమె నుంచి ఏం నేర్చుకున్నారని యాంకర్‌ నుంచి ప్రశ్న ఎదురైంది.  దీనిపై వెంటనే స్పందించాడు నవీన్. అనుష్క నుంచి కౌగిలింతలు నేర్చుకున్నానని ఇలా చెప్పేశాడు. 'సెట్స్ లో అడుగుపెట్టగానే టెక్నీషియన్స్‌కు అనుష్క ఓ వెచ్చటి హగ్ ఇస్తుంది. కానీ  అది ఎంతో అభిమానపూర్వకంగా మాత్రమే ఇచ్చే కౌగిలింత.  ఆవిడ నుంచి నేను కూడా అలా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. అది మనలో ఎంతో పాజిటివ్‌ను ఇస్తుంది. అనుష్కలో ఉన్న మంచి క్వాలిటీస్‌లో ఇదొకటి.' అని ఆయన చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: అనిరుద్‌ గురించి విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌ వైరల్‌)

తాజాగ విడుదలైన ట్రైలర్‌లో అనుష్కను చాలా తక్కువగా చూపించారని, సినిమాలో ఆమె చేసిన రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుందని నవీన్‌ తెలిపాడు. అంతేకాకుండా ఆమె ఏ నటుడితోనైనా ఫర్‌ఫెక్ట్‌గా సింక్ అవుతుందని చెప్పాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)