Breaking News

‘తగ్గేదేలే’ అంటున్న నవీన్‌ పోలిశెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా..

Published on Sun, 09/03/2023 - 17:32

సినిమా ప్రమోషన్స్‌ కోసం అమెరికా వెళ్లనున్నాడు యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి. నవీన్‌, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్‌ అంతా ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ముఖ్యంగా నవీన్‌ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌ని తన భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నాడు.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేశారు.తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి,  కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమాపై  ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. 

ఇక ఇప్పుడు అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మెరికాలోని డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)