Breaking News

మా సినిమాలో పండగ ఎనర్జీని చూస్తారు: నవీన్‌ పొలిశెట్టి

Published on Wed, 01/14/2026 - 00:35

‘‘మన తెలుగువారికి సంక్రాంతి అనేది ప్రత్యేకమైన పండగ. ఎన్ని బాధలున్నా మర్చిపోయి మన వాళ్లను కలుసుకొని సంతోషంగా ఉంటాం. ఒత్తిడిని పక్కన పెట్టి పిండి వంటలు తింటూ నలుగురితో నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంటాం. అలాంటి పండగ ఎనర్జీని మా ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో చూడబోతున్నారు. మన ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించేలా మా సినిమా ఉంటుంది’’ అని నవీన్‌ పొలిశెట్టి తెలిపారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు.

మారి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన స్పందన సినిమాపై మా నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఇదొక పర్ఫెక్ట్‌ పండగ సినిమా. అందర్నీ అలరించేలా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ– ‘‘కుటుంబంతో కలిసి మా సినిమా చూడండి... హాయిగా నవ్వుకుంటూ ఈ సంక్రాంతి పండగను జరుపుకోండి’’ అని చెప్పారు. ‘‘మీ బాధలన్నీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోండి’’ అన్నారు మారి. నాగవంశీ మాట్లాడుతూ– ‘‘గోదావరి నేపథ్యంలో జరిగే ఒక అందమైన కథతో ‘అనగనగా ఒక రాజు’ రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్‌ సెటైర్‌ ఎపిసోడ్‌ కూడా ఇందులో ఉంది. కామెడీ, ఎమోషన్, ఫైట్, పాటలు... ఇలా అన్ని అంశాలతో తెరకెక్కిన పండగ సినిమా ఇది’’ అని తెలిపారు. బాల నటుడు రేవంత్‌ (బుల్లిరాజు) మాట్లాడాడు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)