Breaking News

ఒకప్పుడు నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌.. ఇప్పుడేమో ఆటో డ్రైవర్‌

Published on Sat, 07/05/2025 - 08:05

కర్ణాటకు చెందిన షఫీక్ సయ్యద్.. బెంగుళూరు మురికివాడలో జన్మించాడు. చిన్నతనంలోనే పెద్ద పెద్ద కలలు కన్నాడు. ఏదోరోజు అమితాబ్‌ బచ్చన్‌ అంతటి స్టార్‌ కావాలని కోరిక పెంచుకున్నాడు. సినిమాపై మక్కువతో కేవలం 12ఏళ్ల వయసులో ఒంటరిగానే ముంబై రైలు ఎక్కాడు. అనుకున్నట్లుగానే సినిమాలో ఛాన్స్‌ దక్కించుకున్నాడు. తొలి సినిమాతోనే ఉత్తమ బాల నటుడిగా నేషనల్‌ అవార్డ్‌ అందుకుని దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయాడు. ఆప్పుడు తన ఆశలకు జీవం వచ్చింది. ఇక గొప్ప స్టార్‌ అయిపోతానని నిర్ణయించుకున్నాడు. కానీ, తర్వాత ఛాన్సులు రాలేదు. అదే వచ్చింటే ఒక అమితాబ్‌, చిరంజీవిలా ఇండస్ట్రీని ఏలేవాడేమో చెప్పలేము కదా..!

1988లో విడుదలైన 'సలాం బాంబే' సినిమా ఒక సంచలనం. ఎక్కడ చూసిన షఫీక్ సయ్యద్ పోస్టర్స్‌తోనే సినిమా టైటిల్‌ కనిపించేది.  ఈ చిత్రాన్ని మీరా నాయర్ దర్శకత్వం వహించడమే కాకుండా ఆమె నిర్మాతగా ఉన్నారు.  ముంబైలోని మురికివాడల్లో నివసించే పిల్లల దైనందిన జీవితాలను ఈ చిత్రంలో చూపించారు. ఆ ఏడాదిలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డ్‌ను అందుకోవడంతో పాటు ఉత్తమ బాల నటుడిగా షఫీక్ సయ్యద్ కూడా అవార్డ్‌ దక్కించుకున్నాడు. ఆపై సలాం బాంబే మూవీ ఆస్కార్‌ అవార్డ్‌కు కూడా నామినేట్‌ అయింది. భారత్‌ నుంచి అలా ఎంపికైన రెండో చిత్రంగా రికార్డ్‌ పొందింది. లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డ్స్‌ను ఈ చిత్రం అందుకుంది. వీటన్నింటికీ కారణం సలాం బాంబేలో షఫీక్‌ సయ్యద్‌ నటనే అని అప్పట్లో చెప్పుకునేవారు.

'షఫీక్‌ సయ్యద్‌' ఎందుకు ఆటో నడుపుతున్నాడు
'సలాం బాంబే' సినిమా వల్లే షఫీక్‌ సయ్యద్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఏదైనా పార్టీలో అతను కనిపిస్తే చాలు పెద్దపెద్ద వారు కూడా పోటోలు దిగేందుకు పోటీపడేవారు. దీనిని బాలీవుడ్‌ మేకర్స్‌ జీర్జించుకోలేకపోయారు. తమ పిల్లలకు దక్కిని గౌరం ఇతనికి ఇంతలా రావడం ఏంటి అనే అక్కసు వారిలో మొదలైంది.  అంతే, షఫీక్‌ సయ్యద్‌కు ఛాన్సులు ఆగిపోయాయి. ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సయ్యద్‌.. రెండో సినిమా ఛాన్సు కోసం ఐదేళ్లు పోరాడాడు. ఆకలితోనే  అక్కడి సినిమా ఆఫీసుల చుట్టు తిరిగాడు. 

అలా 1993లో పతంగ్‌ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత అతనికి ఎవరు కూడా ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో తిరిగి బెంగళూరు వచ్చేశాడు. కుటుంబానికి ఆర్థికంగా నిలబడేందుకు ఏదో చిన్నచిన్న పనులు చేసుకునేవాడు. ప్రస్తుతం తన జీవనోపాధి కోసం  బెంగళూరులోనే ఆటో నడుపుతున్నాడు. భార్య, తల్లి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని టీవీ ప్రోగ్రామ్‌లలో గెస్ట్‌గా పిలుస్తుంటారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)