Breaking News

జాతీయ అవార్డ్ గ్రహీత విక్రమ్ కన్నుమూత

Published on Sat, 05/10/2025 - 14:27

జాతీయ అవార్డ్ గ్రహీత, ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్(51) కన్నుమూశారు. తొలుత మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఈయన తర్వాత పలు హిందీలో చిత్రాల్లో నటించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు.  

విక్రమ్ గైక్వాడ్ మరణవార్త తెలుసుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నివాళులర్పించారు. ఈయన మరణం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భారతీయ సినిమా, నాటక రంగానికి విక్రమ్ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. 

(ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్‌’కి రికార్డు ఓపెనింగ్స్‌... తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?)

విక్రమ్ గైక్వాడ్ మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన వాటిలో.. బెల్ బాటమ్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్ 30, కేదార్‌నాథ్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్,  ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ తదితర హిందీ సినిమాలున్నాయి.

మరాఠీ సినిమాల్లో ఈయన్ని బాలగంధర్వ అని కూడా అంటారు. విక్రమ్‌ మరణంపై చిత్రపరిశ్రమలోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే విక్రమ్ మృతికి కారణం ఇంకా తెలియరాలేదు.

(ఇదీ చదవండి: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)