Breaking News

ఆరేళ్లుగా వెండితెరకు దూరం.. మంచి ఆఫర్‌ కోసం ఎదురుచూస్తున్న నటాషా!

Published on Mon, 04/14/2025 - 17:27

నటాషా స్టాంకోవిచ్‌ (Nataša Stanković).. హిందీలో పలు సినిమాల్లో ఐటం సాంగ్స్‌ చేసింది. 2019లో వచ్చిన ద బాడీ మూవీలో జలక్‌దిక్‌లాజా రీలోడెడ్‌ పాటలో చివరిసారిగా మెరిసింది. తర్వాత మరే సినిమా సాంగ్‌లోనూ కనిపించనేలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తరచూ తన పేరు వినిపిస్తూనే ఉంది. కారణం.. భర్త, క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యాతో విడిపోవడమే! గతేడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ మధ్య నటాషా.. తన కుమారుడిని తీసుకుని కొన్నాళ్లు సెర్బియాలో ఉండి వచ్చింది.

నటాషా రీఎంట్రీ?
తాజాగా ముంబైలో బాంబేటైమ్స్‌ నిర్వహించిన ఫ్యాషన్‌ వీక్‌కు హాజరైంది. మోడల్‌గా ర్యాంప్‌ వ్యాక్‌ కూడా చేసింది. ఈ కార్యక్రమం అనంతరం నటాషా మాట్లాడుతూ.. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేయాలనుందని.. ఆ దిశగా ఏమైనా చర్చలు జరుగుతాయేమో చూడాలి అని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇకపోతే నటాషా ర్యాంప్‌ వాక్‌ చేస్తుంటే.. మోడల్‌, ఫిట్‌నెస్‌ కోచ్‌ అలెగ్జాండర్‌.. అగస్త్యను ఆడిస్తున్న వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. పిల్లాడిని తీసుకెళ్లే ప్లేస్‌ అది కాదని కామెంట్లు చేస్తున్నారు. 

మోడల్‌గా కెరీర్‌ ఆరంభం..
సెర్బియాకు చెందిన నటాషా.. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. సత్యాగ్రహ్‌ సినిమాలో అయ్యో జీ అనే స్పెషల్‌ సాంగ్‌తో వెండితెరపై అడుగుపెట్టింది. అనంతరం హిందీ బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లోనూ పాల్గొంది. కాకపోతే నెల రోజులకే ఎలిమినేట్‌ అయింది. బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన గుర్తింపుతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. 

ఐటం సాంగ్స్‌తో ఫేమస్‌
ప్రైవేట్‌ సాంగ్స్‌తో పాటు సినిమాలో ఐటం సాంగ్స్‌ చేసుకుంటూ పోయింది. 2016లో 7 హవర్స్‌ టు గో అనే సినిమాలో పోలీస్‌గా నటించింది. ఎక్కువగా డ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేసే నటాషా నాచ్‌ బలియే 9 రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోలో నటుడు అలీగోనీతో కలిసి జంటగా పార్టిసిపేట్‌ చేసింది. ఈ జోడీ ఫినాలే వరకు చేరుకుని థర్డ్‌ రన్నరప్స్‌గా నిలిచింది. 2020లో ఫ్లెష్‌ అనే వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసింది.

 

 

చదవండి: వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)