Breaking News

నా అవార్డులను వాష్‌రూమ్‌ డోర్‌ హ్యాండిల్స్‌గా పెట్టా: నటుడు

Published on Sun, 06/04/2023 - 21:14

బాలీవుడ్‌ స్టార్‌ నసీరుద్దీన్‌ షా సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇచ్చిన అవార్డులను బాత్రూమ్‌ డోర్లకు హ్యాండిల్స్‌గా వాడతానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఒక పాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్పనటుడు అవుతాడు. అంతేకానీ ఇండస్ట్రీలో ఉన్న బోలెడంతమంది నటుల్లో ఒకరిని సెలక్ట్‌ చేసుకుని ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడు ఇతడే అని ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్‌? అలాంటి అవార్డులను చూసి నేను పొంగిపోను.

ఆ అవార్డులతో అదే పని చేస్తా
అంతెందుకు ఇటీవల నాకు ప్రకటించిన రెండు పురస్కారాలను అందుకోవడానికి కూడా నేను వెళ్లలేదు. కాబట్టి నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నేను ఫామ్‌హౌస్‌ కడితే అక్కడ వాష్‌రూమ్‌ హ్యాండిల్స్‌గా అవార్డులను పెట్టాలనుకున్నాను. అప్పుడు వాష్‌రూమ్‌కు వెళ్లే అందరూ హ్యాండిల్‌ పట్టుకుంటారు. అంటే వారికి అవార్డు వచ్చినట్లే కదా! అందుకే అదే పని చేశాను. ఫిలింఫేర్‌ అనీ, అదనీ, ఇదనీ.. ఇచ్చే అవార్డుల్లో నాకేమీ గొప్ప కనిపించడం లేదు. కెరీర్‌ ప్రారంభంలో అవార్డు వస్తే సంతోషంగా ఫీలయ్యాను. ఆ తర్వాత వరుసగా ట్రోఫీలు రావడం మొదలయ్యాయి.

వెధవలా మిగిలిపోతానేమోనని నాన్న కంగారు
రానురానూ ఇవన్నీ లాబీయింగ్‌ వల్ల వచ్చినవే అని అర్థమైంది. దీంతో వాటిని పట్టించుకోవడం మానేశా. కానీ పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అందుకున్నప్పుడు మాత్రం మా నాన్న అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈ పనికి మాలిన పని చేసుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక వెధవలా మిగిలిపోతావు అనేవాడు. ఆరోజు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి పురస్కారం అందుకుంటున్న సమయంలో మా నాన్న ఇదంతా చూసి సంతోషిస్తాడని కృతజ్ఞతగా పైకి చూశాను. ఈ రెండు పురస్కారాలు అందుకున్నందుకు నేను గర్విస్తున్నాను. కానీ పోటీపడి ప్రకటించే అవార్డులకు మాత్రం నేను వ్యతిరేకిని' అని చెప్పుకొచ్చాడు నసీరుద్దీన్‌ షా.

చదవండి: డబ్బు కోసం ఆ పని చేశా.. సీక్రెట్‌గా ఉంచాల్సిన వీడియో లీక్‌

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)