Breaking News

మాజీ బాయ్‌ఫ్రెండ్‌ హత్య కేసులో ప్రముఖ నటి సోదరి అరెస్ట్‌

Published on Tue, 12/03/2024 - 09:36

బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ నర్గీస్‌ ఫక్రీ మరోసారి నెట్టింట వైరల్‌ అవుతుంది. తన సోదరి అలియాను హత్య కేసులో న్యూయార్క్‌ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె పేరు ట్రెండ్‌ అవుతుంది. అలియా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ ఎడ్వర్డ్ జాకబ్స్, ఆయన స్నేహితురాలి హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉంది. ఎడ్వర్డ్‌కు చెందిన గ్యారేజీకి అలియా నిప్పంటించడంతో వారు చనిపోయారని న్యూయార్క్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.

న్యూయార్క్ డైలీ న్యూస్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ తన మాజీ ప్రియుడు ఎడ్వర్డ్ జాకబ్స్ , అతని  స్నేహితురాలు అనస్తాసియా ఎట్టియెన్‌ల మరణానికి కారణం అలియానే అని అనుమానాలు ఉన్నాయి. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో  అనస్తాసియా మధ్య పెరుగుతున్న బంధం పట్ల అలియా అసూయతో ఉన్నట్లు వార్తా నివేదికలు సూచిస్తున్నాయి. అందుకే, అసూయతో, ఆమె గ్యారేజీకి నిప్పు పెట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. నిప్పు పెట్టిన తర్వాత విష వాయువులు వెలువడటంతో వారు మరణించారు. ఆమె అసూయనే ఇద్దరు వ్యక్తులను చనిపోయేలా చేసిందని అక్కడి మీడియా పేర్కొంటుంది. క్వీన్స్ క్రిమినల్ కోర్టులో  విచారణ అనంతరం ఆమెకు బెయిల్ కూడా నిరాకరించబడింది.

ఈ ఘటనపై నర్గీస్ ఫక్రీ తల్లి న్యూయార్క్ డైలీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ' నా కూతురు ఇలాంటి తప్పు చేయదు. ఒకరిని చంపుతుందని నేను అనుకోను. ఆమెకు ఇతరులకు సహాయం చేయడం మాత్రమే తెలుసు. ఆమె కొద్దిరోజుల క్రితం దంతాలకు సంబంధించి చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె ఓపియాయిడ్లు (మత్తు మందులు) ఎక్కువగా తీసుకుంది. ఆ సమయం నుంచి ఆమెలో కొన్ని మార్పులు వచ్చాయి.' అని ఆమె తెలిపింది. నర్గీస్‌ ఫక్రీ బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించింది. అయితే, తెలుగులో హరి హర వీర మల్లు సినిమాలో ఆమె కనిపించనుంది.

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)