Breaking News

9 రోజులు మంచినీళ్లు తాగే బతుకుతా.. అన్నం ముట్టను: హీరోయిన్‌

Published on Sat, 07/05/2025 - 20:03

చాలామంది వారానికోసారి లేదా ఏదైనా పండగ ఉన్నప్పుడు ఉపవాసం చేస్తుంటారు. అలా బాలీవుడ్‌ బ్యూటీ నర్గీస్‌ ఫక్రి (Nargis Fakhri)కి కూడా ఉపవాసం చేసే అలవాటుందట! కాకపోతే ఎప్పుడో ఒకసారి కాదు.. ఏకధాటిగా 9 రోజులు ఏమీ తినకుండా ఉంటుందట! ఇలా ఏడాదికి రెండుసార్లు దీన్ని కఠిన దీక్షలా పాటిస్తానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్గీస్‌ ఫక్రి మాట్లాడుతూ.. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ఆ సమయంలో ఏమీ తినను. 

9 రోజులు తిండి లేకుండా..
తొమ్మిదిరోజులపాటు కేవలం నీళ్లు తాగే బతుకుతాను. ఇది చాలా కష్టంగా ఉంటుంది. 9 రోజులయిపోయేసరికి ముఖం వికృతంగా మారుతుంది. కళ్లు, బుగ్గలు లోపలకు వెళ్లిపోయి, దవడ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ముఖంలో మాత్రం కాస్త గ్లో ఉంటుంది. అయితే ఇది పాటించమని నేనెవరికీ సలహా ఇవ్వను. చాలామంది ఏదైనా త్వరగా జరిగిపోవాలనుకుంటారు. కానీ దేనికైనా సమయం పడుతుంది. ఉదాహరణకు మంచి నిద్ర కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. నేనైతే రోజూ ఎనిమిది గంటలు నిద్రపోతాను. 

సినిమా
ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటాను. విటమిన్స్‌, మినరల్స్‌ వంటి మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. నర్గీస్‌ ఫక్రి.. రాక్‌స్టార్‌ (2011) మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మే తేరా హీరో, హౌస్‌ఫుల్‌ 3, టొర్బాజ్‌, అజర్‌, మద్రాస్‌ కేఫ్‌, అమవాస్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల హౌస్‌ఫుల్‌ 5 సినిమాతో అలరించింది.

చదవండి: పాపం.. ఏదో నోరు జారింది.. రష్మికను వదిలేయండి: నటి

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)