Breaking News

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'హరిహర వీరమల్లు' హీరోయిన్‌

Published on Sat, 02/22/2025 - 09:15

బాలీవుడ్‌ హీరోయిన్‌ నర్గీస్‌ ఫక్రీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా టోనీ బేగ్ అనే వ్యాపారవేత్తతో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. ‘రాక్‌స్టార్‌’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నర్గీస్‌ ఫక్రీ మద్రాస్‌ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్‌–3...మొదలైన సినిమాలతో అలరించింది. హాలీవుడ్‌  సినిమా  ‘స్పై’లోనూ నటించింది. 

‘అమావాస్య’ సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమైంది. పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న హరిహర వీరమల్లులో కూడా ఈ బ్యూటీ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ‘రాక్‌స్టార్‌ యాక్ట్రెస్‌’గా పిలుచుకునే నర్గీస్‌ ఫక్రీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు.

లాస్ ఏంజెల్స్‌లోని ఒక స్టార్‌ హోటల్‌లో నర్గీస్‌ ఫక్రీ, టోనీ బేగ్‌ల వివాహం జరిగింది. కానీ, పెళ్లి చేసుకున్న విషయాన్ని వారిద్దరూ అధికారికంగా వెల్లడించలేదు. అయతే,  పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కేక్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు సంబంధించిన టూర్ ఫొటోలను ఆమె షేర్‌ చేసింది. అమెరికాలో పెళ్లి చేసుకున్న వారిద్దరూ  అక్కడినుంచే స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. టోనీ బేగ్ కశ్మీర్‌ కుటుంబానికి చెందిన ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది. అయితే, చాలా ఏళ్ల క్రితమే వారి కుటంబం అమెరికాలో స్థరపడింది. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు ఆమె గతంలో పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)