Breaking News

హత్య కేసులో హీరోయిన్‌ సోదరి అరెస్ట్‌.. 20 ఏళ్లుగా మాటల్లేవ్‌!

Published on Wed, 12/04/2024 - 17:39

ప్రియుడి హత్య కేసులో బాలీవుడ్‌ హీరోయిన్‌ నర్గీస్‌ ఫక్రి సోదరి ఆలియాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన కూతురు ఒకర్ని హత్య చేసేంత కిరాతకురాలు కాదని, తనకు సహాయం చేయడం మాత్రమే వచ్చని ఆమె తల్లి వెనకేసుకొస్తోంది. నర్గీస్‌ ఫక్రి మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించనేలేదు. సుమారు 20 ఏళ్లుగా తన సోదరితో నర్గీస్‌కు మాటల్లేవట! 

20 ఏళ్లుగా మాటల్లేవ్‌
ఈ రెండు దశాబ్దాల్లో ఈ అక్కాచెల్లెళ్లు కలుసుకుందే లేదని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తన సోదరి అరెస్టయిన విషయాన్ని.. అందరిలాగే నర్గీస్‌ కూడా వార్తలు చూసే తెలుసుకుందట! తాజాగా నర్గీస్‌ ఫక్రి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. నీకోసం మేమంతా వస్తున్నాం అని రాసుకొచ్చింది. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, సోనమ్‌ బజ్వాతో కలిసున్న ఫోటోను ఈ పోస్ట్‌కు జత చేసింది. ఈ ముగ్గురూ హౌస్‌ఫుల్‌ 5 సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానుంది.

ఏం జరిగిందంటే?
అమెరికాలో ఉంటున్న ఆలియా..ఎడ్వర్డ్‌ జాకబ్స్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. ఏమైందో ఏమోకానీ వీళ్లు బ్రేకప్‌ చెప్పుకున్నారు. అయితే మళ్లీ కలిసిపోదామన్న ఆలియా అభ్యర్థనను ఎడ్వర్డ్‌ తోసిపుచ్చాడట! పైగా తనను వదిలేసి అతడి స్నేహితురాలు అనస్తాసియాతో ఎక్కువ చనువుగా ఉండటాన్ని జీర్ణించలేకపోయిందట! ఈ క్రమంలోనే గ్యారేజీకి నిప్పుపెట్టి ఎడ్వర్డ్‌, అనస్తాసియాను చంపేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో అరెస్టయిన ఆలియాను డిసెంబర్‌ 9న కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)