Breaking News

ట్రిమ్‌ చేసిన వెర్షన్‌కూ స్పందన బాగుంది

Published on Sun, 12/21/2025 - 16:03

నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో నరేశ్‌ అగస్త్య మాట్లాడుతూ– ‘‘నిన్న (శుక్రవారం) మ్యాట్నీ షోస్‌ నుంచే 90 శాతం థియేటర్స్‌ ఫుల్‌ అవుతున్నాయి. 

కొన్ని ల్యాగ్‌ సీన్స్, సాంగ్స్‌ ట్రిమ్‌ చేశాం. ఆ ట్రిమ్‌ అయిన వెర్షన్‌కూ రెస్పాన్స్‌ బాగుంది. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌ అవుతూ నవ్వుకుంటున్నారు. చిన్న సినిమాకు నిర్మాణ విలువలు బాగుంటే, ఎంత మంచి క్వాలిటీతో సినిమా స్క్రీన్‌ మీదకు వస్తుందనే విషయానికి ‘గుర్రం ΄ాపిరెడ్డి’ ఓ ఉదాహరణ’’ అని చెప్పారు. ‘‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ చిత్రం వల్ల మా సినిమా మార్నింగ్‌ షోస్‌ కాస్త స్లోగా మొదలయ్యాయి. సాయంత్రానికి 90శాతం ఆక్యుపెన్సీతో మా సినిమా ప్రదర్శితం కావడం హ్యాపీ’’ అని చెప్పారు మురళీ మనోహర్‌. ‘‘థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. ప్రేక్షకులు ఇంకొంత సపోర్ట్‌ చేసి, మా సినిమాను హిట్‌ చేయాలి’’  అని కోరారు వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా, యాక్టర్స్‌ జీవన్‌ కుమార్, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, వంశీధర్‌ కోసిగి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కృష్ణ సౌరభ్‌ మాట్లాడారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)