Breaking News

'ఓజీ'లో నారా రోహిత్‌ కాబోయే సతీమణి

Published on Tue, 05/27/2025 - 14:12

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓజీ'లో నారా ఫ్యామిలీకి కాబోయే కోడలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  నటుడు నారా రోహిత్‌కు కాబోయే సతీమణి  శిరీషా (శిరీష లేళ్ల) ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో నటించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్‌ హష్మి ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.

'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్‌ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. త్వరలో ఏడడుగుల బంధంతో ఒకటి కానున్నారు. భైరవం సినిమాతో నారా రోహిత్‌, ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు.  ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. 

సినిమాలపై మక్కువతో ఆమె హైదరబాద్‌లోని తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా  నారా రోహిత్‌తో ప్రతినిధి2లో అవకాశం దక్కింది. అలా వారి పరిచయం కాస్త పెళ్లి వైపు అడుగులు పడ్డాయి.  వివాహానికి ఇంకా సమయం ఉండటంతో ఆమె పలు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓజీలో ఛాన్స్‌ దక్కడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని సమాచారం.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)