Breaking News

శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్‌

Published on Sat, 05/31/2025 - 10:59

టాలీవుడ్‌ హీరో నారా రోహిత్‌ పెళ్లిపై ప్రకటన చేశారు. తాజాగా తను నటించిన కొత్త సినిమా భైరవం విడుదలైంది. ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పెళ్లి ప్రస్థావన రావడంతో అందుకు క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవంగా నారా రోహిత్‌ పెళ్లి ఇప్పటికే జరగాల్సి ఉంది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయింది. కానీ, తన తండ్రి మరణం వల్ల వాయిదా వేసుకున్నారు.

నారా రోహిత్‌, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగింది.  త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్‌లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి. అయితే, ఇప్పుడు నారా రోహిత్‌ పెళ్లి టైమ్‌ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. హిందు సంప్రదాయం ప్రకారం.. అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్‌ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాదిలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు  ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)