Breaking News

ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది: నారా రోహిత్‌

Published on Wed, 05/28/2025 - 01:06

‘‘ముగ్గురు హీరోలతో ఒక సినిమా చేయడం అంత సులభం కాదు. కానీ రాధామోహన్‌గారు మమ్మల్ని (సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌) నమ్మి ‘భైరవం’ని రాజీ పడకుండా తీశారు. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. రాధామోహన్‌గారికి ఈ సినిమాతో పెద్ద విజయం, భారీగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని నారా రోహిత్‌ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’.

విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో జయంతిలాల్‌ గడా సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిర్మాత బెల్లంకొండ సురేష్‌గారు ఫోన్‌ చేసి, తమిళ చిత్రం ‘గరుడన్‌’ చూడమంటే చూశాను... చాలా నచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌ ‘భైరవం’లో శశికుమార్‌పాత్ర చేయాలని కోరారు. ఆపాత్ర నాకూ బాగా నచ్చడంతో చేశాను.

నా తొలి కమర్షియల్‌ మాస్‌ ఫిలిం ‘భైరవం’. ఇక ఇన్నేళ్ల నా కెరీర్‌లో విజయాలు, అపజయాలు, ఎత్తు పల్లాలు ఉన్నాయి. కథల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు మళ్లీ చేయకూడదని తెలిసొచ్చింది. ఇకపై నా నుంచి రెగ్యులర్‌గా సినిమాలు వస్తాయి. నేను హీరోగా నటించిన ‘సుందరకాండ’ విడుదల జూలైలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

‘పుష్ప’లో షెకావత్‌ (ఫాహద్‌ ఫాజిల్‌ చేసినపాత్ర) క్యారెక్టర్‌కు నన్ను అడిగారు. ఫొటోలు పంపమంటే, మీసాలు పెంచుకుని ఫొటోషూట్‌ చేయించి, పంపాను. కానీ ఇదిపాన్‌ ఇండియా మూవీ కాబట్టి వివిధ భాషల వాళ్లని తీసుకోవాలనే ఆలోచనతో ఫాహద్‌ని తీసుకుని ఉంటారేమో.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)