Breaking News

తండ్రి కాబోతున్న నారా రోహిత్.. ఆ ఇద్దరు కూడా

Published on Fri, 05/01/2026 - 09:23

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త సినిమాల హడావుడితోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రెండు రోజుల క్రితమే తిరుమలలో పెళ్లి చేసుకున్నాడు. అంతకు రెండు నెలల ముందు హీరోయిన్ రష్మిక కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇదలా ఉండగానే టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు శుభవార్తలు చెప్పేశారు.

(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో సామజవరగమన, మృత్యుంజయ్, మ్యాడ్ స్క్వేర్ తదితర సినిమాల్లో నటించిన హీరోయిన్ రెబా మోనికా జాన్, తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లో భర్తతో దిగిన ఫొటోలని షేర్ చేసింది. త్వరలో తాము ముగ్గురు కాబోతున్నామని చెప్పింది. దీంతో ఈమెకు విషెస్ తెలియజేస్తున్నారు.

గతేడాది అక్టోబరులో పెళ్లి చేసుకున్న హీరో నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఇతడి భార్య, నటి శిరీష ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. రీసెంట్‌గా సీమంతం వేడుక జరగ్గా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారికంగా ఈ విషయాన్ని అయితే ఈ జంట బయటపెట్టలేదు. 'ప్రతినిధి 2' మూవీ చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డ రోహిత్-శిరీష.. పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు.

'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా నటించిన కన్నడ ధనంజయ భార్య ధన్యత కూడా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని తాజాగానే ఈ జంట ప్రకటించారు. తమ ప్రపంచం పెరగనుందని చెబుతూ ఫొటోలని పంచుకున్నారు. కన్నడలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. తెలుగులో 'పుష్ప' కాకుండా ఒకటి రెండు డబ్బింగ్ చిత్రాలతో వచ్చాడు గానీ వర్కౌట్ కాలేదు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

Videos

ట్రంప్ పై దాడి Live వీడియో.. ఇలా వచ్చాడు.. అలా కాల్చాడు

వివాదంలో పంజాబ్ సీఎం.. మద్యం సేవించి అసెంబ్లీకి..?

పాలకొల్లులో అరుదైన ఘటన.. పది ఫలితాల్లో తల్లీకొడుకులు ఒకే సారి పాస్

ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..

భార్య పాపులారిటీ తట్టుకోలేక నరికి చంపిన భర్త

బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమ..?

ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ

వేధింపుల్లో బాబు కొత్త ట్రెండ్

మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

EVMల టాంపరింగ్.. బెంగాల్లో షాకింగ్ వీడియో

Photos

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు

+5

భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)

+5

రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్‌డే విషెస్ (ఫోటోలు)