Breaking News

నాని 'సరిపోదా శనివారం' ఓటీటీ రిలీజ్ డేట్ లాక్?

Published on Mon, 09/16/2024 - 10:46

నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. దాదాపు 20 రోజులకు రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, తుపాన్ ధాటికి ఈ మూవీ పరిస్థితి దారుణం అయిపోయింది. తొలి వీకెండ్ ఓ మాదిరి వసూళ్లు వచ్చాయి కానీ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా థియేట్రికల్ రన్ దాదాపు చివరకొచ్చేసింది. ఈ క్రమంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే ఓ వ్యక్తి కథతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ఎస్జే సూర్య సూపర్ యాక్టింగ్ చేశారు. కానీ వర్షాల వల్ల ఈ సినిమాని చాలామంది థియేటర్లలో చూడలేకపోయారు. అయితే డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు అనుకున్న టైం కంటే ముందే దీన్ని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)

ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమా.. సెప్టెంబరు 26న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నాని మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేసినట్లు అవుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది మరికొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.

'సరిపోదా శనివారం' స్టోరీ విషయానికొస్తే సూర్య(నాని)కి కోపమెక్కువ. కానీ తల్లి చెప్పడంతో శనివారం మాత్రమే కోపాన్ని చూపిస్తుంటాడు. పెద్దయిన తర్వాత కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్)తో ప్రేమలో పడతాడు. ఇదలా ఉండగా దయానంద్ (ఎస్జే సూర్య) అనే సీఐ క్రూరుడు, మహా కోపిష్టి. ఇతడు సోకులపాలెం అనే ఊరి ప్రజల్ని తెగ హింసిస్తుంటాడు. అలాంటి దయాకి సూర్య ఎలా అడ్డు నిలబడ్డాడు? చివరకు ఏమైందంనేదే మిగిలిన కథ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్‍.. ఆ మూడు కాస్త స్పెషల్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)