Breaking News

'ప్యారడైజ్'.. నాని కోరిక తీరడం కష్టమే

Published on Wed, 09/23/2026 - 12:24

నాని హీరోగా చేసిన 'ప్యారడైజ్' సినిమా.. బుధవారం(సెప్టెంబరు 23) సాయంత్రం ప్రీమియర్లతో రిలీజ్ కానుంది. అయితే తన చిత్ర ప్రీమియర్ షోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్‌లో అభిమానులతో కలిసి చూడాలనుకుంటున్నానని.. ఈ మేరకు తనకు అనుమతి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పోలీసులని ఉద్దేశించి ట్విటర్‌లో విజ్ఞప్తి చేశాడు.

(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)

అయితే ప్రీమియర్ సందర్భంగా అవసరమైన అన్ని భద్రతా నిబంధనలు, ప్రోటోకాల్స్‌ పూర్తిగా పాటిస్తామని నాని స్పష్టం చేశాడు. ఈ విషయంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చిత్ర బృందం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు పెట్టుకోవాలని.. ప్రజల భద్రత, జనసమూహ నియంత్రణని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ఇక రేవంత్ రెడ్డి ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్ సిటీ కమీషనర్ సీవీ ఆనంద్.. ప్రస్తుతం గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా వాహనాలు, ప్రజల రద్దీ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నందున, అదనపు పోలీసు బలగాలని ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా అనే అంశంపై హైదరాబాద్ నగర పోలీసులతో సంప్రదించాల్సి ఉందన్నారు. గతంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

దీనిపై స్పందించిన నాని.. గణేష్ నిమజ్జన ఏర్పాట్ల ప్రాధాన్యతని తాము పూర్తిగా అర్థం చేసుకున్నామని.. పోలీసు శాఖపై ఎలాంటి అదనపు భారం పడటం లేదా ప్రజలకు అసౌకర్యం కలగడం తమ ఉద్దేశం కాదని అన్నాడు. పోలీసు శాఖ తుది నిర్ణయాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని స్పష్టం చేశాడు. భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటే, పరిస్థితిని అర్థం చేసుకుని ప్రీమియర్‌కు రాకపోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. చూస్తుంటే ప్రీమియర్ల బంతి పోలీసులు చేతిలో ఉంది. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే నాని కోరిక నెరవేరడం కష్టమే.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా.. కొడితే కుంభస్థలం లేదంటే మాత్రం?)

Videos

ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...

క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

అయ్య‌ప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి కొట్టుకుపోవ‌డం ప‌క్కా

CJP మరో డిమాండ్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రంగం సిద్ధం.

స్టాక్ మార్కెట్ భారీ పతనం! ₹6 లక్షల కోట్లు ఆవిరి!

టీచర్లు అంటూ యువగళం టీమ్ బూతులు.. అనిత వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

బండ బూతులు తిడుతూ..ఎలా కొట్టించిందంటే?

కొట్టుకుపోయిన కోస్తా.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

Photos

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డులో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు (ఫొటోలు)

+5

ఏష నాగుల కట్ట మీద.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్‌..(ఫొటోలు)

+5

ఏపీ : తీవ్ర వాయుగుండం...ఉత్తరాంధ్ర అతలాకుతలం (ఫొటోలు)

+5

వేడుకకు వేళాయే...రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర (ఫొటోలు)